‘పుష్ప 1 ది రైజ్’ లో శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్నకు తగిన ప్రాధాన్యం దక్కినప్పటికీ కథ పరంగా ఛాలెంజింగ్ అనిపించే స్కోప్ ఎక్కువ దొరకలేదు. అందుకే నా సామి నా సామీ లాంటి పాటలు హైలైటయ్యాయి. అయితే ‘పుష్ప 2 ది రూల్’ లో అలా ఉండదని, పెర్ఫార్మన్స్ గొప్పగా చూపించుకునే అవకాశం ఇందులో ఉందని రష్మిక పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. కానీ అదెంత వరకు నిజమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఫస్ట్ హాఫ్ అయ్యేదాకా డౌట్ అలాగే ఉండిపోయింది. అల్లు అర్జున్ తో కెమిస్ట్రీని పండించడం, సూపర్ గా డాన్స్ చేయడం తప్ప అప్పటిదాకా గొప్పగా చెప్పుకునేది లేదు.
కానీ సెకండాఫ్ లో సీన్ మారిపోయింది. జాతరలో పాట, ఫైట్ ఎపిసోడ్ అయిపోయాక మొగుడిని అవమానించిన వాళ్ళకు క్లాసు పీకే సన్నివేశంలో రష్మిక మందన్న ఏకంగా బన్నీనే సైడయ్యేలా డామినేట్ చేసింది. ఇలా డిజైన్ చేసిన క్రెడిట్ సుకుమార్ కే దక్కుతుంది కానీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న శ్రీవల్లి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో నరసింహనాయుడులో బాలయ్య అన్నలకు సిమ్రాన్ వార్నింగ్ ఇచ్చే సీన్ థియేటర్లను షేక్ చేసింది. మళ్ళీ అలాంటి క్యారెక్టర్ ఎవరికీ దక్కలేదు. ఇన్నేళ్ల తర్వాత రష్మిక మందన్న ఆ స్థాయిలో అదరగొట్టేసి చప్పట్లు కొట్టించుకుంది.
యానిమల్ లో రన్బీర్ కపూర్ లాంటి వయొలెంట్ యాక్టర్ కి ధీటుగా పెర్ఫార్మ్ చేసిన రష్మిక మందన్న ఇప్పుడు స్క్రీన్ మొత్తాన్ని తినేసే పుష్పరాజ్ ని మరిపించేలా నటించడం మరో మైలురాయిని జోడించింది. రిలీజ్ కు ముందు ట్రైలర్ లో ఒక షాట్ చూసి ప్రచారం జరిగినట్టు తన పాత్రకు ఎలాంటి ట్విస్టు ఇచ్చి అభిమానులను బాధ పెట్టలేదు. పీలింగ్స్ సాంగ్ సైతం ఓ రేంజ్ లో పేలింది. ఒకవేళ పుష్ప 1 లాగే పరిమితంగా ఉంటే ఏమయ్యేదో కానీ పుష్ప 2 పుణ్యమాని ఉత్తరాది ప్రేక్షకులు యానిమల్ తర్వాత మరింతగా రష్మికతో కనెక్ట్ అవ్వడానికి స్కోప్ దక్కింది. ఇదంతా నెక్స్ట్ రిలీజ్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ కు ఉపయోగపడేదే.
This post was last modified on December 5, 2024 2:49 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…