`సీజ్ ది షిప్` – గత నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్` ఇది! ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు యువతలోనూ జోరుగా ఈ డైలాగ్ వినిపిస్తోంది. కాకినాడ పోర్టులో జరుగుతున్న రేషన్ బియ్య అక్రమాలను నిలువరించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనను ముగించుకుని నేరుగా కాకినాడకు వెళ్లిన ఆయన.. మంత్రినాదెండ్ల మనోహర్‌తో కలిసి కాకినాడ పోర్టును సందర్శించారు. ఈ సమయంలో పోర్టుకు 10 మైళ్ల దూరంలో సముద్రంలో ఉన్న విదేశీ షిప్పును ఆయన పరిశీలించారు.
ఈ సమయంలో పవన్‌ను అధికారులు అడ్డగించడం.. కాకినాడ ఎస్పీ సెలవుపై వెళ్లడం.. పవన్‌ను షిప్ వద్దకు తీసుకువెళ్లకుండా అధికారులు జాప్యం చేయడం వంటివి తీవ్ర ఆందోళనకు రాజకీయ వివాదానికి కూడా గురి చేశాయి. అయినప్పటికీ.. పవన్ సదరు విదేశీ షిప్పు వద్దకు చేరుకుని బియ్యాన్ని పరిశీలించారు. ఈ బియ్యంలో రేషన్ సరుకు కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన “సీజ్ ది షిప్“ అంటూ సదరు విదేశీ షిప్పును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత.. మీడియా మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ అప్పటి వరకు జరిగిన సంగతులను వివరించారు.
ఇదిలావుంటే.. పవన్ చేసిన “సీజ్ ది షిప్“ వ్యాఖ్య జోరుగా వైరల్ అయింది. ఆయన అభిమానులు సహా.. జనసేన పార్టీ నాయకులు, కూటమి పార్టీల నాయకులు కూడా ఈ డైలాగ్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై భిన్నమైన వాదనలు వచ్చినా.. ఈ డైలాగ్ అయితే.. పాపులర్ అయింది. గతంలో `మనల్నెవడ్రా ఆపేది` తరహాలో ఈ `సీజ్ ది షిప్` డైలాగ్ కూడా పాపులర్ అయింది. ఇప్పుడు ఇదే డైలాగుతో తాజాగా ఓ తెలుగు సినిమా టైటిల్ రిజిస్టర్ అయింది.
`ఆర్ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ` నిర్మాణ సంస్థ `సీజ్ ది షిప్` పేరుతో సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు రూ.1100 చెల్లించి.. ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకుంది. ఈ టైటిల్‌పై సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ కాలపరిమితి ఏడాది పాటు ఉంటుంది. ఏడాదిలోగా సినిమా నిర్మాణం ప్రారంభించి ఛాంబర్‌కు తెలియజేస్తే.. టైటిల్ గడువును సినిమా పూర్తయ్యే వరకు పొడిగిస్తారు. ఇదీ.. సంగతి!!
This post was last modified on December 4, 2024 7:30 pm
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్..…
ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను సీఎం…
ప్యాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారిన 'పుష్ప 2: ది రూల్' సెగలు పక్క రాష్ట్రం కర్ణాటకలో బలంగా తగిలాయి.…
మరికొద్ది గంటల్లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్లు మొదలుకాబోతున్న తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేయడం…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారా? మంత్రి వ్యవహార శైలిపై…
రామ్ పోతినేని ‘నేను శైలజా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటీ కీర్తి సురేష్. నేను లోకల్,అజ్ఞాతవాసి లాంటి చిత్రాలతో…