మహేష్ తో మామూలు సినిమానే!

బాహుబలి తర్వాత చేసే చిత్రానికి అంత రేంజ్ ఉండాలంటే కనీసం ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి రావాలని తారక్, చరణ్ ఇద్దరినీ ఒక సినిమాలో పెట్టిన రాజమౌళి… దీని తర్వాతి చిత్రం మహేష్ తో సోలోగా అనౌన్స్ చేయడం ఆసక్తికరమైంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రాజమౌళి ప్రతి సినిమాకి సమయం తీసుకుంటున్నాడు.

ఆర్.ఆర్.ఆర్. ఏడాదిలో పూర్తి చేసేద్దామనుకున్నా కానీ కుదర్లేదు. అందుకే ఈసారి గ్రాఫిక్స్, పీరియడ్ సెటప్ లేకుండా కమర్షియల్ సినిమా చేయాలనీ రాజమౌళి భావిస్తున్నాడట. బాలీవుడ్ ఆడియన్స్ కూడా హీరోయిజం ఇష్టపడతారు కనుక పాన్ ఇండియా అంటే భారీ సెట్లు, పీరియడ్ బ్యాక్ డ్రాప్స్ ఎల్లవేళలా అవసరం లేదని, తన మార్కు మాస్ మసాలా సినిమా తీసి కూడా చాలా కాలం అవుతుంది కనుక మహేష్ తో అలాంటి ఎలివేషన్స్ ఉన్న స్టోరీ సిద్ధం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహేష్ ఒకే సినిమాపై ఏళ్ల తరబడి పని చేయరాదని ఖలేజాతో డిసైడ్ అయిపోయాడు కనుక ఇది నమ్మశక్యంగానే ఉంది.