చిరు – ఓదెల : న్యాచురల్ స్టార్ రక్త ప్రమాణం!

నిన్న సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో సినిమా ప్రకటన ఇవ్వడం సోషల్ మీడియాని ఊపేసింది. నిజానికీ వార్త మూడు నాలుగు రోజుల క్రితమే లీకైనప్పటికీ తర్వాత ఎప్పుడో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ దానికి భిన్నంగా ఇంటా బయటా పుష్ప 2 హడివిడి జరుగుతున్న టైంలో ఒక్కసారిగా మెగాస్టార్ వైపు అటెన్షన్ వచ్చేసింది. అసలు మరో కిక్కిచ్చే న్యూస్ దీనికి న్యాచురల్ స్టార్ నాని సమర్పకుడిగా, సహనిర్మాతగా వ్యవహరించబోవడం. ప్రొడ్యూసర్ గా నాని సినిమాలు తీయడం కొత్త కాదు కానీ మెగాస్టార్ కోసం కొత్త బ్యానర్ సెట్ చేయడం అసలు పంచు.

దీనికి సంబంధించిన పోస్టర్ ఇప్పటికే వైరల్ కాగా ఫోటో అప్డేట్స్ తో నాని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ప్రీ లుక్ లో చిరంజీవి చేతుల మీదుగా రక్తం చూపించడం, అతని మనఃశాంతి హింసలోనే దొరుకుతుందని ట్యాగ్ లైన్ పెట్టడం ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. తాజాగా చిరు, శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ కలిసి రక్తంలో తడిసిన చేతులను ఒడిసిపట్టుకున్న పిక్ ఒకటి పెట్టడం ఫ్యాన్స్ మధ హాట్ టాపిక్ గా మారింది. ది ప్యారడైజ్ అప్డేట్స్ ఇంకా మొదలుకాకుండానే మెగా మూవీకి సంబంధించిన వార్తలతో నాని ఊపిరి సలపనివ్వకుండా చేయడం విశేషం. ముగ్గురు కలిసి దిగిన ఫోటో కూడా బాగా హల్చల్ చేసింది.

సో ఫ్యాన్స్ ఎలాంటి కాంబో అయితే కోరుకుంటున్నారో చిరంజీవి అలాంటివి ఎంచుకుంటున్న క్లారిటీ వచ్చేసింది. దసరాతో నానికి ఊర మాస్ ఇమేజ్ తెచ్చిన శ్రీకాంత్ ఓదెల తాను అభిమానించే మెగాస్టార్ ని ఇంకెలా చూపిస్తాడోనని మూవీ లవర్స్ తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. ముందు విశ్వంభర బాలన్స్ పూర్తి చేయాలి. ఆ తర్వాత అనిల్ రావిపూడితో సినిమాకు చిరు రెడీ అవుతారు. ఈలోగా నాని ది ప్యారడైజ్ ని పూర్తి చేసుకుని శ్రీకాంత్ ఓదెల ఇటు వచ్చేస్తాడు. ఇప్పుడే ఇంత హైప్ ఉందంటే రాబోయే రోజుల్లో పెరగబోయే క్రేజ్ ఊహించుకోవడం కష్టం.