మంచు ఫ్యామిలీ కలల చిత్రం.. కన్నప్ప. ఈ సినిమా చేయాలని మంచు విష్ణు కెరీర్ ఆరంభం నుంచి కలలు కంటూనే ఉన్నాడు. దశాబ్దం కిందటే తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు జరిగాయి. కానీ ఎందుకో అప్పుడా ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు గత ఏడాది ఈ ప్రెస్టీజియస్ మూవీని సెట్స్ మీదికి తీసుకెళ్లింది విష్ణు అండ్ టీం. బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా.. స్క్రిప్టు మంచు విష్ణు అండ్ టీం అందించింది. ఈ సినిమా మీద ఏకంగా వంద కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. మంచు వారికి చాలా స్పెషల్ ఫిలిం అయిన ‘కన్నప్ప’లో ఆ కుటుంబానికి చెందిన పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవలే మంచు మోహన్ బాబును మహాదేవ శాస్త్రిగా పరిచయం చేయడం తెలిసిందే. అంతకంటే ముందు మంచు విష్ణు తనయుడు అవ్రామ్ లుక్‌ను కూడా లాంచ్ చేశారు. ఇప్పుడు మంచు కుటుంబం నుంచి ఇంకో ఇద్దరు వెండితెరకు పరిచయం అవుతున్న విషయాన్ని వెల్లడించారు. విష్ణు-వెరోనికాల ముద్దుల తనయురాళ్లు అరియానా-వివియానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. వాళ్లిద్దరూ నృత్య కళాకారిణులుగా కనిపించబోతున్నారు. వీళ్లిద్దరూ కూడా మిగతా పాత్రధారుల్లాగే అడవి బిడ్డల అవతారాల్లోనే కనిపించారు. శివుడి కోసం ఎలాంటి పరిస్థితుల్లో అయినా నృత్యం చేయడానికి సిద్ధంగా ఉండే కళాకారిణులుగా వీరు కనిపింబోతున్నారు. వీరి పరిచయం చూశాక.. ‘కన్నప్ప’ కోసం మంచు కుటుంబం మొత్తం దిగిందే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక మిగిలింది మంచు మనోజ్, మంచు లక్ష్మీప్రసన్న మాత్రమే. వాళ్లు కూడా ఈ సినిమాలో నటించారేమో మున్ముందు తెలుస్తుంది. ముందు డిసెంబరులోనే రిలీజ్ అనుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 25కు వాయిదా వేశారు. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ సినిమా కావడంతో మేకింగ్ ఆలస్యం అవుతోంది.
This post was last modified on December 2, 2024 3:53 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…