ఒక్క అక్షరంని టైటిల్ గా పెట్టడం, తన పేరునే సినిమాగా తీయడం ఒక్క ఉపేంద్రకు మాత్రమే సాధ్యమైన అరుదైన ఫీట్లు, A బ్లాక్ బస్టర్ అయినా, ఓం కన్నడలో అయిదువందల సార్లు రీ రిలీజ్ చేసినా దాని వెనుక ఆయన క్రేజీ ఆలోచనలే కారణం. తెలుగులోనూ తనకు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడంటే సన్నాఫ్ సత్యమూర్తి లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలో గుర్తిస్తారు కానీ ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే అప్పట్లోనే అలా ఎలా ఆలోచించాడా అనిపిస్తుంది. నయనతారతో జోడిగా చేసిన సూపర్ సింబల్ మూవీలోనూ ఉపేంద్ర మార్కు బలంగా ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం.
ఈ నెల 20న ఉప్పి కొత్త సినిమా యుఐ విడుదలకు రెడీ అవుతోంది. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉండదని అభిమానులు ముందే ప్రిపేరయ్యారు కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా ఉపేంద్ర నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఏదో ఇవ్వబోతున్నాడు. ఇవాళ వార్నర్ పేరుతో రెండు నిమిషాల నిడివి ఉన్న టీజర్ ఒకటి విడుదల చేశారు. 2040 సంవత్సరంలో మనిషి కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, గింజ మెతుకు కోసం కొట్టుకు చచ్చే పరిస్థితుల్లో టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత నాశనం చేయబోతోందనే చిన్న శాంపిల్ ఇందులో వదిలారు. అధికారం ఉంటే ఎలాంటి ధిక్కారాలు పని చేయవనే సందేశం ఇచ్చారు.
ఒకరకంగా చెప్పాలంటే ఉపేంద్ర చేస్తోంది పెద్ద సాహసం. స్వీయ దర్శకత్వంలో ఇంత భారీ బడ్జెట్ తో రిస్క్ అనిపించే ఆలోచనను తెరకెక్కించడానికి చాలా ధైర్యం కావాలి. విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్న ఈ వెరైటీ థ్రిల్లర్ లో ఉపేంద్ర గతంలో ఎన్నడూ చూడని గెటప్స్ లో దర్శనమివ్వబోతున్నాడు. యుఐ చూశాక ఆడియన్స్ ఆలోచనా విధానం మారిపోతుందని చెప్పడం చూస్తే ఇదేదో ఆషామాషీ వ్యవహారంలా కనిపించడం లేదు. విపరీతమైన పోటీ మధ్య రిలీజవుతున్న యుఐకి తెలుగులోనూ పెద్ద ప్లానింగ్ చేస్తున్నారు. చూడాలి ఉప్పి దాదా ఈసారి గురి తప్పకుండా ఎలా గెలుస్తాడో.
This post was last modified on December 2, 2024 12:43 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…