మలయాళంలో బిగ్గెస్ట్ స్టార్ అయిన మోహన్ లాల్ చాలా ఏళ్ల నుంచి నిలకడగా ఇండస్ట్రీ హిట్లు ఇస్తున్నాడు. కొత్త రికార్డులు నెలకొల్పాలన్నా.. పాతవి బద్దలు కొట్టాలన్నా మోహన్ లాల్‌కే సాధ్యం మల్లూవుడ్‌లో. ‘దృశ్యం’ సినిమాతో మలయాళ పరిశ్రమకు తొలి 50 కోట్ల సినిమాను అందించిన ఆయనే.. ఆ తర్వాత ‘పులి మురుగన్’తో వంద కోట్ల క్లబ్బునూ పరిచయం చేశాడు. కొన్నేళ్లకు ‘లూసిఫర్’తో ఆ సినిమా వసూళ్లనూ దాటేశాడు. ఆపై 2018, మంజుమ్మల్ బాయ్స్ చిత్రాలు ఈ రికార్డును అధిగమించాయి. ప్రస్తుత రికార్డు ‘మంజుమ్మల్ బాయ్స్’ పేరిటే ఉంది. దాన్ని అధిగమించడం లాల్‌కే సాధ్యం అని మలయాళ ట్రేడ్ పండిట్లు భావిస్తున్నారు.
అలాంటి సత్తా ఉన్న సినిమాతోనే మోహన్ లాల్ బాక్సాఫీస్ వేటకు రెడీ అవుతున్నాడు. ఆయన కొత్త చిత్రం ‘ఎల్-2: ఎంపురన్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ‘ఎల్-2: ఎంపురన్’ లాల్ చివరి బిగ్గెస్ట్ హిట్ ‘లూసిఫర్’కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. లాల్‌కు వీరాభిమాని అయిన స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా మారిన తన ఆరాధ్య కథానాయకుడిని అభిమానులు మెచ్చేలా ప్రెజెంట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అతనే పార్ట్-2ను కూడా డైరెక్ట్ చేశాడు.
‘లూసిఫర్’కు కథ అందించిన నటుడు మురళీ గోపీనే ఈ చిత్రానికి కూడా స్క్రిప్టు అందించాడు. ఒకప్పటి లాల్ డ్రైవర్, మిత్రుడు.. తర్వాత నిర్మాతగా మారి లాల్‌తో ఎన్నో బ్లాక్ బస్టర్లు తీసిన ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘లూసిఫర్’ చివర్లో చూపించిన చిన్న గ్లింప్స్‌తోనే ‘ఎంపురన్’ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఫస్ట్ పార్ట్ కంటే ఇది ఇంకా పెద్ద స్థాయిలో ఉంటుందని అర్థమైంది. ‘లూసిఫర్’ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేయగా.. అది ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది.
This post was last modified on December 1, 2024 4:13 pm
టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేనంత టికెట్ రేట్ల హైక్ తెచ్చుకున్న పుష్ప 2 ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించడం…
మరో రెండు రోజుల్లో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్న శోభిత ధూళిపాల సరికొత్త పెళ్లికూతురు లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సముద్రంలోకి వెళ్లి షిప్ పరిశీలించిన అంశం పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని…
మంచు ఫ్యామిలీ కలల చిత్రం.. కన్నప్ప. ఈ సినిమా చేయాలని మంచు విష్ణు కెరీర్ ఆరంభం నుంచి కలలు కంటూనే…
ఏపీలో కూటమి ప్రభుత్వానికి నేత్రాల్లాంటి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ భేటీ అయ్యారు. అమరావతి పరిధిలోని…
2024 సంవత్సరం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి అస్సలు కలిసి రాలేదు. ఇటీవల కాలంలో చాలా ఎక్కువ నష్టాలు చూసిన సంస్థ…