Movie News

తెలుగు స్టేట్స్ లోనే డబుల్ సెంచరీ కొట్టాలి పుష్పా…

నవంబర్ నెల ఈ రోజుతో అయిపోతోంది. ఇంకో అయిదే రోజుల్లో పుష్ప రాజ్ రాబోతున్నాడు. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేయడమే కాక ప్యాన్ ఇండియా రీచ్ కోసం పాట్నా, కోచి, చెన్నై, ముంబై లాంటి నాన్ తెలుగు ప్రాంతాల్లో అద్భుతమైన ఈవెంట్లు నిర్వహించడంతో దేశవ్యాప్తంగా పుష్ప 2కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ లో ఎవరికీ దక్కని అతి పెద్ద సౌత్ రిలీజ్ దీనికే దక్కబోతోంది. ఇక కేరళ, కర్ణాటక సంగతి చెప్పనక్కర్లేదు. తమిళనాడులో సైతం డిస్ట్రిబ్యూటర్లు మాస్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కానుండటంతో అందరి వేళ్ళు బుక్ మై షో, పేటిఎం తదితర యాప్స్ వైపు వెళ్తున్నాయి.

ఇదిలా ఉండగా ఏపీ తెలంగాణ నుంచే పుష్ప 2 రెండు వందల కోట్లకు పైగా షేర్ రాబట్టే టార్గెట్ తో బరిలో దిగుతోంది. అంటే దీనికి రెట్టింపు మొత్తం గ్రాస్ రావాలి. అసాధ్యం కాదు కానీ టాక్ ఎక్స్ ట్రాడినరిగా వస్తే బన్నీ ఈజీగా లాగేస్తాడు. కాకపోతే టికెట్ రేట్ల మద్దతు చాలా అవసరం. మైత్రి ఎంత మొత్తానికి అప్లికేషన్ పెట్టుకున్నారు, ప్రభుత్వాలు ఎంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయనేది ఈ రోజు క్లారిటీ వచ్చేస్తుంది. దేవర కన్నా స్వల్ప మొత్తం లేదా అంతే పెంపు ఉండొచ్చనే టాక్ బలంగా ఉంది. సో మరీ విపరీతంగా పెంచేస్తారేమో అనే భయం అవసరం లేకకపోవచ్చు. బుకింగ్స్ పేలిపోవడం మాత్రం ఖాయం.

ట్రేడ్ ట్రాక్ ప్రకారం పుష్ప 2 రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 210 నుంచి 215 కోట్ల మధ్య షేర్ తేవాల్సి ఉంటుంది. దాదాపు ప్రతి థియేటర్లో ఇదే సినిమా ప్రదర్శించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు ఏబీసీ సెంటర్ల తేడా లేకుండా వరస షోలతో హోరెత్తించబోతున్నారు. టికెట్లకున్న డిమాండ్ చూస్తే నాన్ రాజమౌళి రికార్డులు సులభమే అనేలా ఉంది పరిస్థితి. గత మూడు వారాలుగా సరైన సినిమా లేక థియేటర్లకు దూరంగా ఉన్న మూవీ లవర్స్ పుష్ప 2 కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అందరూ అలాగే ఉంటే మాత్రం పుష్ప 2 బ్రేక్ ఈవెన్ అందుకావడం పూల మీద నడకే.

This post was last modified on November 30, 2024 10:49 am

Share

Recent Posts

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

1 hour ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

1 hour ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

1 hour ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

2 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

2 hours ago

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్…

3 hours ago