కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్.. ఈ సంక్రాంతికి ‘విడాముయర్చి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మగిల్ తిరుమణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రమిది. ఇటీవలే రిలీజైన టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా సాగి అజిత్ అభిమానులను ఆకట్టుకుంది. ఐతే నిజానికి ఈ సినిమా స్థానంలో అజిత్ వేరే చిత్రం చేయాల్సింది. లైకా నిర్మాణంలో నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకుడిగా అజిత్ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ తర్వాత ఏమైందో ఏమో.. ఈ సినిమా పక్కకు వెళ్లిపోయింది. మగిల్ కథ తెరపైకి వచ్చింది. అదే సినిమాగా తెరకెక్కింది.
అజిత్‌తో తన సినిమా ఏమైందనే విషయాన్ని ఇప్పుడు ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో విఘ్నేష్ శివన్ వెల్లడించాడు.తన దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘నానుం రౌడీ దా’ అజిత్‌కు చాలా నచ్చిందని.. పెద్ద సినిమాలు చూడని అజిత్ ఆ చిత్రాన్ని మాత్రం రెండుసార్లు చూసినట్లు తనకు చెప్పాడని.. అందులో పార్తీబన్ పాత్ర ఆయనకు బాగా నచ్చి ఆ తరహలో డార్క్ క్యారెక్టర్‌ను లీడ్ రోల్‌గా చేసి ఎంటర్టైనర్ కథ చేసుకు రావాలని తనకు అజిత్ చెప్పాడని విఘ్నేష్ వెల్లడించాడు. తాను ఆయన చెప్పిన ప్రకారమే కథ రెడీ చేశానని.. ఫాహద్ ఫాజిల్ మూవీ ‘ఆవేశం’ తరహాలో ఆ స్క్రిప్టు తయారైందని.. యునీక్ స్టోరీ రెడీ చేశానని.. తర్వాత లైకా అధినేతలకు ఆ కథ చెప్పానని విఘ్నేష్ తెలిపాడు.
ఐతే ఆ స్క్రిప్టు విన్నపుడు కామెడీ చాలా ఎక్కువైందని అన్నారని.. అజిత్ సినిమా అంటే మాస్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ ఉండాలని వాళ్లు చెప్పారని.. ఒక సెట్ ఆఫ్ మైండ్‌తో వాళ్లు అజిత్ సినిమాను తీయాలనుకున్నారని.. తన కథలో కామెడీ ఎక్కువైందనే ఉద్దేశంతో ఆ సినిమాను ఆపేశారని విఘ్నేష్ తెలిపాడు. ఇక ఇదే లైకా సంస్థలో శివకార్తికేయన్ హీరోగా తాను ‘ఎల్ఐసీ’ పేరుతో ఓ సినిమా చేయాల్సిందని.. ఐతే భవిష్యత్ నేపథ్యంలో నడిచే ఆ కథకు బడ్జెట్ ఎక్కువు అవుతుందని.. అదే కథను ప్రస్తుత సమయంలోకి మార్చి సినిమా చేయమని తనకు చెప్పారని.. కానీ ‘బాహుబలి’ కథను వర్తమానంలో నడిపితే ఎలా సూట్ కాదో, తన కథను కూడా భవిష్యత్తులో కాకుండా ప్రస్తుత సమయంలో తీస్తే బాగుండదనే ఉద్దేశంతో నిర్మాతలకు గుడ్ బై చెప్పేశానని.. తన ప్రొడక్షన్లోనే ఈ సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నానని విఘ్నేష్ వెల్లడించాడు.
This post was last modified on November 30, 2024 9:57 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…