ఇప్పుడంటే పుష్ప అనే పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది కానీ.. అల్లు అర్జున్, సుకుమార్‌ల మాస్ కాంబినేషన్లో వచ్చే సినిమాకు ఎక్కువగా అమ్మాయిలు పెట్టుకునే పేరును పెడతారని ఎవ్వరూ ఊహించి ఉండరు. అసలీ టైటిల్ ప్రకటించినపుడు మిశ్రమ స్పందన వ్యక్తమైంది కూడా. టైటిల్ ఇంత సాఫ్ట్‌గా ఉందేంటి అన్నవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ టైటిల్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ తర్వాత తర్వాత ఆ టైటిల్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.
ఐతే ఈ టైటిల్ పెట్టినపుడు తమలోనూ కొంత సందేహాలు ఉన్నప్పటికీ.. దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చిన ఐడియా ప్లస్ అయినట్లు అల్లు అర్జున్ వెల్లడించాడు. ముంబయిలో జరిగిన పుష్ప-2 ప్రమోషనల్ ప్రెస్ మీట్లో బన్నీ.. పుష్ప-1 టైటిల్, ఫస్ట్ లుక్ రివీలైనప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ఫస్ట్ లుక్ లాంచ్ అయినపుడు ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయని.. తర్వాత ఏ దశలోనూ అంచనాలు తగ్గలేదని బన్నీ అభిప్రాయపడ్డాడు. ఐతే సినిమాకు పుష్ప అనే టైటిల్ పెట్టినపుడు..తనకు, సుకుమార్‌కు మంచి ఫ్రెండ్ అయిన హరీష్ శంకర్ ఈ పేరు చాలా సాఫ్ట్‌గా ఉందని చెప్పాడని.. ఐతే టైటిల్‌కు పూర్తి భిన్నంగా హీరో ఫస్ట్ లుక్‌ను చాలా రఫ్‌గా ఉండేలా డిజైన్ చేయాలని సూచించాడని.. అప్పుడు రెండూ బ్యాలెన్స్ అయిపోతాయని అన్నాడని బన్నీ తెలిపాడు.
అతను చెప్పినట్లే రఫ్ ఫస్ట్ లుక్ డిజైన్ చేయడంతో అద్భుతమైన స్పందన వచ్చిందని బన్నీ తెలిపాడు. ఇక పుష్ప-2 ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. ప్రేక్షకులకు ఏదైనా పెద్ద షాక్ ఇవ్వాలని సుకుమార్ అనుకున్నాడని, అందుకే లేడీ గెటప్‌లో ఉన్న తన లుక్‌నే ఫస్ట్ లుక్‌గా వదిలారని.. అప్పుడు ప్రేక్షకులు చాలా ఆశ్చర్యపోయారని.. ఈ ఐడియా కూడా చాలా బాగా పని చేసిందని బన్నీ అభిప్రాయపడ్డాడు. ఈ ప్రెస్ మీట్లో సుకుమార్ గురించి కూడా బన్నీ చాలా గొప్పగా మాట్లాడాడు. తాను స్టార్ అవ్వడానికి సుకుమారే కారణమని, ఆయన వల్లే తన కెరీర్ మారిందని చెప్పాడు.
This post was last modified on November 30, 2024 9:07 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…