హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్ రేపు మిస్ యుతో థియేటర్లలో అడుగు పెట్టాల్సింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చాలా విశేషాలు పంచుకున్నాడు. పుష్ప 2 ది రూల్ కు వారం ముందు రావడం రిస్క్ కాదాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాగున్న మూవీని ఎవరూ ఆపలేరని, ఆ మాటకొస్తే అవతలి వాళ్లే భయపడతారేమో అనే రేంజ్ లో హామీ ఇచ్చాడు. కట్ చేస్తే మిస్ యు రేపు రావడం లేదు. ఈ కబురు నిన్నే పంచుకున్నారు కానీ కొన్ని డౌట్లు వదిలారు.
చెన్నైతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మిస్ యుని పోస్ట్ పోన్ చేస్తున్నామని సిద్ధార్థ్ చెప్పిన ప్రధాన కారణం. కానీ ఇప్పటిదాకా అంత తుఫాను వచ్చే పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు. రేపు షెడ్యూల్ చేసుకున్న ఇతర సినిమాలు యధావిధిగా వస్తున్నాయి. సరే వాన రాకడ, బంధువుల పోకడ ఎవరూ చెప్పేది కాదు కానీ పుష్ప 2 మేనియా చూసే మిస్ యు టీమ్ వెనుకడుగు వేసిందానే అనుమానం రాక మానదు. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో బన్నీ మూవీకి భారీ రిలీజ్ దక్కుతోంది. అలాంటప్పుడు రెండో వారంలో మిస్ యు కనిపించడం కష్టం.
ఒకవేళ నిజంగా వర్షాలు పడే పనైతే కనక గోరుచుట్టు మీద రోకలిపోటు లాగా రెండు దెబ్బలు తగిలించుకోవాల్సి ఉంటుంది. నా సామిరంగా ఫేమ్ ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ లవ్ కం రొమాంటిక్ డ్రామాకు ఎన్ రాజశేఖర్ దర్శకత్వం వహించగా జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. దీని మీద అంతగా బజ్ లేని నేపథ్యంలో ప్రమోషన్లకు మరింత టైం దొరకడం మంచిదే. అయితే డిసెంబర్ 20 నుంచి 25 దాకా ఏకంగా పన్నెండు సినిమాలు బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్న నేపథ్యంలో మిస్ యుకి ఎలాంటి డేట్ సెట్ చేసుకుంటారో చూడాలి. పుష్ప 2 టాక్ చూసి నిర్ణయం తీసుకుంటారేమో.
This post was last modified on November 28, 2024 5:23 pm
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…