సోషల్ మీడియాలో నిన్నట్నుంచి కాజల్ అగర్వాల్ పెళ్లి వార్తే హాట్ టాపిక్. దాదాపు ఏడాది నుంచి కాజల్ పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. ఆమె ఒక వ్యాపారవేత్తను పెళ్లాడబోతోందని అనుకుంటూనే ఉన్నారు. చివరికి ఆ వార్తే నిజమైంది. ఆమె గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను ఈ నెల 30న పెళ్లి చేసుకోబోతోంది. స్వయంగా కాజలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఐతే కాజల్ పెళ్లి చేసుకుందామనుకున్నాక అబ్బాయిల్ని వెతకడం మొదలయ్యాక గౌతమ్‌ను చూసుకుందని అనుకుంటే పొరబాటే. అతడితో ఆమెకు ఎన్నో ఏళ్ల ముందు నుంచే పరిచయం ఉందని సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్న ఫొటోల్ని చూస్తే అర్థమవుతోంది. కాజల్ గతంలో పార్టీల్లో పాల్గొన్నప్పటి చాలా ఫొటోలో గౌతమ్ ఉన్నాడు. అతడితో ఆమె చాలా క్లోజ్‌గా కూడా కనిపిస్తోంది.
దీన్ని బట్టి కాజల్‌ది ప్రేమ పెళ్లి అని అర్థమవుతోంది. ముందు గౌతమ్‌తో పరిచయం స్నేహంగా మారి.. ఆ తర్వాత ప్రేమకు దారి తీసినట్లుంది. గౌతమ్‌తో ఉన్న ఫొటోల్లో కాజల్ లుక్ చూస్తే ఏడెనిమిదేళ్ల కిందటి ఆమె సినిమాల లుక్స్ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి వీళ్ల సుదీర్ఘ బంధమే అన్నమాట. ఇక కాజల్‌కు కాబోయే వరుడు అని తెలియగానే గౌతమ్ గురించి నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. అతడి ప్రొఫైల్, నెట్‌వర్త్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం గౌతమ్ ‘డిసెర్న్ లివింగ్’ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీకి సీఈవోగా ఉన్నాడు. ఆన్ లైన్ ద్వారా ఇంటీరియర్ డిజైనింగ్ ఆర్డర్స్ తీసుకుని సర్వీస్ ఇచ్చే సంస్థ ఇది. దీంతో పాటు గత నాలుగైదేళ్లలో అతను మరికొన్ని వ్యాపారాలు చేశాడు. చాలా వరకు అవి స్టార్టప్‌లే. తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో ‘ఇంటీరియర్, టెక్, డిజైన్ ఎంతూజియాస్ట్’ అని ఉంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో చాలా వరకు ఇంటీరియర్ డిజైనింగ్‌కు సంబంధించిన ఫొటోలే ఉన్నాయి. గౌతమ్ మంచి అథ్లెట్ అని అర్థమవుతోంది. అతను తరచుగా మారథాన్ పరుగుల్లో పాల్గొంటాడని తెలుస్తోంది. సంబంధిత ఫొటోలు చాలానే కనిపిస్తున్నాయి.
This post was last modified on October 7, 2020 2:33 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…