2019లోనే శాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ రుక్మిణి వసంత్ కు బ్రేక్ రావడానికి నాలుగేళ్లు పట్టింది. సప్తసాగరాలు దాటి సైడ్ ఏబి ఆమెకు ఒకేసారి డబుల్ ప్రమోషన్ తీసుకొచ్చాయి. నటన, అందం రెండూ కలగలిసి ఎక్స్ పోజింగ్ లేకుండా పేరు తెచ్చుకోవడం మాటలు కాదు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవకుండా వరస ఫ్లాపులు పలకరించాయి. తక్కువ గ్యాప్ లో శ్రీమురళి బఘీరా, నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రెండూ డిజాస్టర్ కావడం ఊహించని ట్విస్ట్. శివరాజ్ కుమార్ సరసన భైరతి రణగల్ హిట్ అయినప్పటికీ అందులో పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం సంతృప్తిని కలిగించలేదు.
ఇక అసలు విషయానికి వద్దాం. జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందే భారీ ప్యాన్ ఇండియా మూవీకి రుక్మిణి వసంత్ ని ఎంచుకున్నారన్న లీక్ రెండు మూడు వారాల క్రితమే వచ్చింది. ఇప్పుడు ఖరారయ్యే దిశగా ఒప్పందం జరిగిపోయిందని లేటెస్ట్ అప్డేట్. అయితే ఒక మెలిక పెట్టారట. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజయ్యే దాకా కొత్త కమిట్ మెంట్లు ఇవ్వకూడదని. నిర్మాణంలో ఉన్న శివ కార్తికేయన్ మూవీ తప్ప వేరొకరికి ఎస్ చెప్పకూడదు. తారక్ సరసన జోడిగా అంటే ఇంతకన్నా ఎవరైనా కోరుకునేది ఏముంటుంది. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.
ఇలా చేయడం కెరీర్ పరంగా రైటా కాదా అని చూస్తే ఒకవిధంగా సరైన నిర్ణయమే అని చెప్పాలి. ఎందుకంటే రుక్మిణి వసంత్ ఇప్పటిదాకా స్టార్ లీగ్ లోకి ప్రవేశించలేదు. ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. తారక్ తో చేయడమంటే బాలీవుడ్ దాకా రీచ్ ఉంటుంది. కాబట్టి ఏడాది వృథా కావడం పెద్ద మ్యాటర్ కాదు. సప్తసాగరాలు దాటి తర్వాత చేసినవేవి సక్సెస్ కాలేదు. పోనీ మంచి పాత్రలు వచ్చాయా అంటే అదీ లేదు. అలాంటప్పుడు సంవత్సరం వేస్ట్ అనుకోకుండా ఫిక్స్ అయిపోవడం ఉత్తమం. కాకపోతే సలార్, కెజిఎఫ్ లా కాకుండా ప్రశాంత్ నీల్ కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా రుక్మిణి పాత్రని డిజైన్ చేస్తే చాలు.
This post was last modified on November 27, 2024 4:33 pm
ఏకంగా 7500 కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. మరో వారం రోజుల్లో మహా క్రతువ ను…
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…