Movie News

సిద్దార్థ్ కోపం ఎవరి మీద?

డబ్బింగ్ మూవీ ‘బాయ్స్’తో తెలుగులో మంచి ఫలితాన్నందుకుని.. స్ట్రెయిట్‌గా తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ నటుడు సిద్ధార్థ్. అప్పట్లో అతను తెలుగు స్టార్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. యువతలో, ముఖ్యంగా అమ్మాయిల్లో తన ఫాలోయింగే వేరుగా ఉండేది. కానీ తర్వాత వరుస ఫెయిల్యూర్లు రావడంతో సిద్ధు వెనుకబడిపోయాడు. క్రమంగా తెలుగులో మార్కెట్ పడిపోయి, అవకాశాలు తగ్గిపోయి చివరికి తన మాతృ భాష అయిన తమిళంలోకి వెళ్లిపోయాడు. అక్కడ తన అభిరుచికి తగ్గ సినిమాలేవో చేసుకుంటూ సాగిపోతున్నాడు. అందులో కొన్ని విజయవంతమయ్యాయి. కొన్ని డిజాస్టర్లు అయ్యాయి. తెలుగు ప్రేక్షకులు అతణ్ని కాదనుకోవడం లాంటిదేమీ జరగలేదు. తనకు తానుగా కోలీవుడ్‌కు వెళ్లిపోయాడన్నది వాస్తవం.

ఐతే తిరిగి తెలుగులో మార్కెట్ సంపాదించాలని సిద్ధు చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు కానీ కుదరడం లేదు. ‘గృహం’ సినిమా గేమ్ చేంజర్ అవుతుందనుకున్నాడు కానీ.. అలా ఏమీ జరగలేదు. తర్వాత పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. తెలుగులో నేరుగా చేసిన ‘మహాసముద్రం’ పెద్ద డిజాస్టర్ కావడంతో సిద్ధు పుంజుకోవడానికి అవకాశమే లేకపోయింది. ఐతే ‘మహాసముద్రం’ టైంలో కానీ.. తన డబ్బింగ్ సినిమాల ప్రమోషన్ల కోసం వచ్చినపుడు కానీ.. సిద్ధులో ఒక రకమైన అసంతృప్తి, ఆవేదన, కోపం కనిపిస్తున్నాయి. తెలుగులో ఒకప్పుడు తనకున్న మార్కెట్ అంతా కరిగిపోవడం చూసి అతను తట్టుకోలేకపోతున్నాడు. తన సినిమాలకు థియేటర్లకు ఇవ్వమని, ప్రేక్షకులు వచ్చి థియేటర్లకు చూడమని అడగడం వరకు బాగానే ఉంది. కానీ టాలీవుడ్ మీద, ప్రేక్షకుల మీద అతను అసహనం చూపించడం.. మీడయా మీద కౌంటర్లు వేయడమే ఇక్కడి వాళ్లకు నచ్చట్లేదు. ఏమైనా అంటే ఒకప్పటి తన వైభవం గురించి మాట్లాడతాడు.

అప్పట్లోనే తాను పాన్ ఇండియా స్టార్ అంటాడు. తాను తెలుగులో సినిమాలు చేయట్లేదంటే అది ఇక్కడి ఫిలిం మేకర్స్ తప్పు అంటాడు. ఐతే సిద్ధుకు తెలుగులో ఎందుకు మార్కెట్ పడిపోయింది అన్నది అతను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాలతో తన మీద భారీగా అంచనాలు పెంచాక.. సరైన సినిమాలు చేయలేదతను. చుక్కల్లో చంద్రుడు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, 180, ఓ మై ఫ్రెండ్.. ఇలా సిద్ధు ఫ్లాపుల జాబితా పెద్దదే. ఎన్ని ఫ్లాపులు వస్తున్నా ప్రతిసారీ సిద్ధుకు తెలుగు ప్రేక్షకులు మంచి ఓపెనింగ్స్ ఇస్తూనే వచ్చారు. కానీ అతను ప్రేక్షకులను మెప్పించే సినిమాలను అందించలేకపోయాడు. అది తన జడ్జిమెంట్ లోపం. ‘ఓ మై ఫ్రెండ్’ తర్వాత తనకు తానుగా టాలీవుడ్ వదిలేసి కోలీవుడ్‌కు వెళ్లిపోయాడు. చాన్నాళ్లు ఇటు తిరిగి కూడా చూడలేదు. తన తమిళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్లు కూడా ఇక్కడ రిలీజ్ కాలేదు. ఇక్కడ ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయి, కొన్నేళ్ల పాటు ఇక్కడ సినిమాలే రిలీజ్ చేయని సిద్ధు.. ఇప్పుడొచ్చి ఇక్కడి దర్శకులు తనకు మంచి స్క్రిప్టులు ఇవ్వడం లేదు, ఆడియన్స్ తన సినిమాలు చూడట్లేదు అని అసహనం చెందితే లాభమేముంది?

This post was last modified on November 26, 2024 2:35 pm

Share
Show comments
Published by
Kumar
Tags: #Siddharth

Recent Posts

ఏపీ రాజ్య‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు!

ఏపీ స‌హా నాలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ఖాళీగా ఉన్న రాజ్య‌స‌భ సీట్ల‌ను భ‌ర్తీ చేసేందుకు కేంద్ర ఎన్ని క‌ల సంఘం…

43 mins ago

అమిత్‌షాతో ఆర్ ఆర్ ఆర్ భేటీ.. ఏం మాట్లాడుకున్నారంటే…

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, టీడీపీ నేత క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు భేటీ అయ్యారు. ఈ…

56 mins ago

ఢిల్లీ టూర్‌లో ప‌వ‌న్‌… కేంద్రమంత్రులతో భేటీ!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఏపీకి సంబంధించిన ప‌ర్యాట‌క ప్రాజెక్టుల‌పై కేంద్ర మంత్రి గ‌జేంద్ర…

1 hour ago

చైతూ – శోభిత పెళ్లి వీడియో: ఎంతకి కొన్నారో తెలుసా…?

అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. సమంత నుంచి విడిపోయాక కొన్నేళ్లు సింగిల్‌గా ఉన్న అతను.. బాలీవుడ్లో స్థిరపడ్డ…

1 hour ago

ఫ్లాపుని సమర్ధించుకోవడానికి ఇన్ని సాకులా

సూర్య కెరీర్ లోనే అత్యంత ఖరీదైన ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిన కంగువా ఊహించని స్థాయిలో డిజాస్టర్ కావడం ఫ్యాన్స్…

2 hours ago