యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్‌కు అనారోగ్యం అంటూ రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే అనారోగ్యం అంటే పెద్దగా పట్టింపు ఉండదు కానీ.. ఇది కరోనా కాలం కావడంతో దాని గురించి గుసగుసలు మొదలయ్యాయి. తేజుకు కరోనా సోకిందనే ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో. దీనిపై తేజు ఒకట్రెండు రోజులు మౌనంగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ట్విట్టర్ ద్వారా ఆ ప్రచారాన్ని సింపుల్‌గా ఖండించేశాడు.
తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి ఏమీ మాట్లాడకుండా తాను ఆరోగ్యంగా, మామూలుగానే ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు తేజు. తాను నటించబోయే కొత్త సినిమా దర్శకుడైన దేవా కట్టాతో కలిసి ఉన్న ఫొటో అది. దేవా ల్యాప్ టాప్ చూస్తూ ఏదో చెబుతుంటే తేజు రాసుకుంటూ కనిపించాడు. అతడిలో అనారోగ్య ఛాయలేమీ లేవు. కరోనా ఉంటే ఇలా వచ్చి దర్శకుడిని ఎందుకు కలుస్తాడు. కాబట్టి తేజుకు వైరస్ లాంటిదేమీ సోకలేదన్నమాట.
దేవా దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి తేజు ముందు నుంచి చాలా ఎగ్జైట్మెంట్‌తో ఉన్నాడు. తాజా ట్వీట్లోనూ దేవా రైటింగ్ అదుర్స్ అన్నట్లుగా మాట్లాడాడు. ఈ ట్వీట్‌పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ.. తనకు తెలిసినంత వరకు ఈ సినిమా అదిరిపోతుందని అన్నాడు. తేజు మావయ్య పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తయారైన పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను చెబుతున్నారు. తేజు ఇటీవలే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను పూర్తి చేశాడు. అది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమ్ కానుంది. మరికొన్ని రోజుల్లోనే దేవా సినిమాను తేజు మొదలుపెట్టనున్నాడు.
This post was last modified on October 7, 2020 9:47 am
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…