హిట్ అవుతుందనుకుంటే ఏకంగా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్న అమరన్ నెల రోజులవుతున్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉండటం గొప్ప విజయం. తమిళంలో అంటే ఏమో అనుకోవచ్చు కానీ తెలుగు వెర్షన్ సైతం దానికి ధీటుగా హిట్టు కొట్టడం ఊహించని పరిణామం. ఏకంగా విజయ్, కమల్, రజని స్థాయిలో శివ కార్తికేయన్ లాంటి టయర్ టూ హీరో కలెక్షన్లు కొల్లగొట్టడం చూసి ఎవరికీ నోటమాట రావడం లేదు. ఒక ఆర్మీ ఆఫీసర్ బయోపిక్ ని ఇంతగా ప్రేక్షకులు స్వంతం చేసుకోవడం అరుదు. గతంలో అడవి శేష్ మేజర్ సక్సెసైనప్పటికీ అమరన్ చాలా స్పెషల్ గా నిలిచింది.
ఇంతగా ఆడియెన్స్ కదిలించిన ఈ సినిమా హీరో శివ కార్తికేయన్ ప్రజలకు ట్విట్టర్ వాడొద్దని సలహా ఇస్తున్నాడు. ఎలాన్ మస్క్ తనను బ్లాక్ చేసినా సరే ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నానని ఒక వివరణ ఇచ్చాడు. సాధారణంగా తన చిత్రం ఏదైనా ఫెయిలైనప్పుడు సోషల్ మీడియా మీద ఆధారపడి తప్పులను తెలుసుకునే ప్రయత్నం చేసేవాడినని కానీ అది ఫలితం ఇవ్వకపోగా నెగటివిటీని మరింత పెంచిందని చెప్పుకొచ్చాడు. టీవీ యాంకర్ గా ఉన్నప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి నేరుగా నిజమైన వ్యక్తుల ఫీడ్ బ్యాక్ తీసుకుని తప్పొప్పులను సరిచేసుకునేవాడినని, కానీ ఎక్స్ లో అలా సాధ్యం కాదని అన్నాడు.
బ్యాక్ టు బేసిక్స్ (మూలాల్లోకి వెళ్లి నేర్చుకోవడం) సూత్రాన్ని పాటించడం వల్లే గత రెండేళ్ల నుంచి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్టు వివరించాడు. క్రికెటర్లు ఫామ్ కోల్పోయినప్పడు చేయాల్సింది ఇదేనని మరో ఉదాహరణ ఇచ్చాడు. శివ కార్తికేయన్ వెర్షన్ లో చూస్తే ఒకరకంగా ఇది కరెక్టే. అక్కర్లేని తప్పుడు సమాచారం విపరీతంగా పెరిగిపోతున్న ట్రెండ్ లో ఏది రైట్ ఏది రాంగని గుర్తించలేని పలువురు నెటిజెన్లు అనవసరమైన సినీ, రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చి చేటు చేసుకుంటున్నారు. ట్విట్టర్ వాడకంలో మంచి బోలెడుంది. కానీ దాన్ని వాడుకునే నేర్పు లేనప్పుడు అమరన్ హీరో అన్నట్టు జాగ్రత్తగా ఉండటం అవసరం.
This post was last modified on November 26, 2024 12:37 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…