Movie News

చిరంజీవి పేరు పెట్టుకున్నారు.. వర్కౌట్ అవుద్దా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎక్కువగా హీరోయిక్ మూవీస్ చేశారు. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశారు. ఐతే ఆయన ఫిల్మోగ్రఫీలో ఇమేజ్‌కు భిన్నంగా చేసిన కొన్ని చిత్రాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. రుద్రవీణ, స్వయంకృషి, విజేత, ఆపద్బాంధవుడు లాంటి ఎమోషనల్ టచ్ ఉన్న చిత్రాలు ఆ జాబితాలో నిలుస్తాయి. వీటితో పాటు అచ్చ తెలుగు హాస్య చిత్రాల రూపకర్త జంధ్యాల దర్శకత్వంలో చేసిన ‘చంటబ్బాయ్’ కూడా చాలా స్పెషల్ మూవీ. అందులో ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ చేసిన చిరు.. అప్పటి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. చిరు అంతగా కామెడీ పండించగలడని అప్పటిదాకా ఎవ్వరూ ఊహించలేదు.

తరాలు మారినా ఇప్పటికీ అదొక ఎవర్ గ్రీన్ మూవీగా కొనసాగుతోంది. ఇప్పటి ప్రేక్షకులు చూసినా.. ఆ చిత్రంతో కనెక్ట్ అవుతారు. కామెడీకి పగలబడి నవ్వుతారు. ‘చంటబ్బాయ్’ తర్వాత చాలామంది ఈ తరహా కామెడీ సినిమా ట్రై చేశారు కానీ.. పెద్దగా వర్కవుట్ కాలేదు.ఈ తరంలోనూ ‘చంటబ్బాయ్’ని అనుకరించే సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకడైన వెన్నెల కిషోర్ హీరోగా ఇప్పటికే ‘చారి 111’ అనే సినిమా ఒకటి తెరకెక్కింది. అది చంటబ్బాయ్ స్టయిల్లో ట్రై చేసిన సినిమానే. కానీ అది వర్కవుట్ కాలేదు.

ఐతే ఇప్పుడు కిషోర్ హీరోగానే ఇలాంటి సినిమా మరొకటి తెరకెక్కింది. అదే.. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రైటర్ మోహన్ డైరెక్ట్ చేసిన చిత్రమిది. ఈ చిత్రానికి ‘చంటబ్బాయ్ తాలూకా’ అనే క్యాప్షన్ కూడా పెట్టడం విశేషం. దీన్ని బట్టే ఇది కూడా అచ్చంగా ‘చంటబ్బాయ్’ స్టయిల్లో సాగే డిటెక్టివ్ కామెడీ మూవీ అని అర్థమవుతోంది. మంచి పాత్ర పడితే వెన్నెల కిషోర్ ఎలా చెలరేగిపోతాడో తెలిసిందే. మరి దర్శకుడు కిషోర్ కోసం అలాంటి పాత్రే డిజైన్ చేశాడేమో చూడాలి. ఈ చిత్రం క్రిస్మస్ రేసులో నిలవడం విశేషం. ఇప్పటికే క్రిస్మస్ వీకెండ్లో రాబిన్ హుడ్, సారంగపాణి జాతకం, భైరవం, విడుదల-2, యుఐ లాంటి సినిమాలు వస్తున్నాయి. వీటికి తోడు ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ కూడా తయారైంది. కాకపోతే ఆ చిత్రాలు వచ్చిన నాలుగు రోజుల గ్యాప్‌లో డిసెంబరు 25న కిషోర్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి చిరంజీవి సినిమా పేరును వాడుకుంటున్న ఈ చిత్రం ఎంతమేర బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపుతుందో చూడాలి.

This post was last modified on November 25, 2024 3:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం? : సిఎం రేవంత్!

టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…

1 hour ago

సత్యం సుందరం దర్శకుడి వింత అనుభవం!

ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…

1 hour ago

ఆ రోజు మాట్లాడతా – జానీ మాస్టర్!

కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…

2 hours ago

టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు చిన్నవి – సినిమా చాలా పెద్దది : దిల్ రాజు

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…

2 hours ago

రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు చెప్పిందిదే…

టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…

2 hours ago

బాబుకు విన్న‌పం: పింఛ‌న్ల జోలికి వెళ్ల‌క‌పోతేనే బెట‌ర్‌!

సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్‌.. ఇది చాలా సునిశిత‌మైన అంశం. ఆర్థికంగా ముడిప‌డిన వ్య‌వ‌హార‌మే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…

3 hours ago