Movie News

తెలుగు సినిమాలపై నేనలా అనలేదు-శ్రుతిహాసన్

కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే. తమిళం, తెలుగు, హిందీ.. ఇలా ప్రతి భాషలోనూ పరాజయాలు ఎదురవడంతో ఆమెపై ‘ఐరెన్ లెగ్’ ముద్ర పడిపోయింది. అలాంటి సమయంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆమె రాత మార్చింది. ‘బ్లాక్ బస్టర్ హీరోయిన్’ అన్న ముద్ర తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన బలుపు, రేసుగుర్రం సైతం బ్లాక్‌బస్టర్లయ్యాయి. ఇక శ్రుతి వెనుదిరిగి చూసుకోలేదు.

ఐతే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటించిన హిట్ సినిమాల గురించి శ్రుతి తక్కువ చేసి మాట్లాడటం వివాదాస్పదమైంది. ‘‘కెరీర్ ఆరంభంలో చాలా మంది కమర్షియల్ సినిమాలే చేయాలని చెప్పారు. కానీ అది నేను ఎక్కువ కాలం వినలేదు. ఐతే నేను కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాను. అవి చేస్తున్న సమయంలో నాకు అంత గొప్పగా అనిపించలేదు. ఇక నుంచి నేను మంచి ఛాయిస్‌లను నిజాయితీగా తీసుకుంటాను’’ అని ఆ ఇంటర్వ్యూలో శ్రుతి పేర్కొంది.

ఐతే ఇక్క శ్రుతి తేలిక చేసి మాట్లాడిన ‘బ్లాక్‌‌బస్టర్’ సినిమాలు గబ్బర్ సింగ్‌, రేసుగుర్రం‌లే అన్న అనుమానాలు నెటిజన్లలో వ్యక్తమయ్యాయి. కొన్ని మీడియాల్లో కూడా దీని గురించి వార్తలు రావడంతో శ్రుతి హాసన్ అప్రమత్తం అయింది. తెలుగు సినిమాల గురించి తాను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదంటూ ట్విట్టర్లో వివరణ ఇచ్చింది.

‘‘కొన్ని తెలుగు మీడియా సంస్థలు నేను జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించి వార్తలు రాశాయి. వాళ్ల ఉద్దేశాలు తప్పు. రేసుగుర్రం, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాల్లో నేను నటించడం నాకెంతో గర్వకారణం.. పైగా పవన్ కళ్యాణ్‌తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా నా జీవితాన్ని మార్చింది. తెలుగు, దక్షిణాది చిత్ర సీమల్లో భాగస్వామిని అవ్వడం నా హృదయంలో ఒక భాగం కావడం లాంటిది. ఆ ఇంటర్వ్యూలో అన్న మాటల సందర్భం వేరు. నేను ఉత్తరాది సినిమాల గురించి ఆ మాటలు అన్నాను. నార్త్-సౌత్ అని సినిమాలను వేరు చేసి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు’’ అని శ్రుతి స్పష్టం చేసింది.

This post was last modified on October 6, 2020 2:53 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

49 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

7 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

11 hours ago