కనివిని ఎరుగని జనసందోహం మధ్య బీహార్ లో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టరయ్యాక పుష్ప 2 తాజాగా చెన్నైలో జరిపిన వేడుక మీద అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. మాములుగా బయటి రాష్ట్రం హీరోలకు తమిళనాడులో అంతగా స్పందన ఉండదనే ప్రచారాన్ని బద్దలు కొడుతూ బన్నీ మీద తమకున్న ప్రేమను అరవ తంబీలు పంచుకున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోగా చివరి దశ పనుల్లో ఉన్న దర్శకుడు సుకుమార్ తప్ప కీలకమైన క్యాస్ట్ అండ్ క్రూ హాజరయ్యింది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఏం చెబుతాడనే దాని మీద ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కనిపించింది.
చెన్నైతో అనుబంధాన్ని పంచుకున్న బన్నీ ఇక్కడ పుట్టి పెరిగిన తనకు ఇరవై ఏళ్ళ జీవితం ఇక్కడే గడిచిందని, ఇప్పటిదాకా ఏది సాధించినా అది ఈ నేలకు అంకితం చేస్తానని చెప్పడం ప్రాంగణాన్ని కరతాళ ధ్వనులతో హోరెత్తిపోయేలా చేసింది. ప్రసంగాన్ని తమిళంలో మొదలుపెట్టడం విశేషం. ఈ సినిమా ఇచ్చే వైల్డెస్ట్ ఫైర్ కోసం మూడేళ్లు కష్టపడ్డానని దాన్ని థియేటర్లలో చూడబోతున్నారని ఊరించాడు. దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ అందరికీ సంగీతం ఇచ్చి తనకు మాత్రం ప్రేమ కూడా ఇస్తాడని స్టేజి మీద తన మ్యూజిక్ డైరెక్టర్ మీద అభిమానం ప్రదర్శించడం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.
నాలుగేళ్లుగా రష్మిక మందన్నతో ప్రయాణం చేయడం వల్ల వేరే హీరోయిన్లను కలుసుకున్నప్పుడు తను రష్మిక కాదని నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుందని చెప్పడం నవ్వులు పూయించింది. శ్రీలీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తనతో డాన్స్ చేసేటప్పుడు అలెర్ట్ గా ఉన్నానని, కష్టపడే తత్వంతో పాటు సూపర్ క్యూట్ నెస్ ని మీరే చూస్తారని చెప్పడం బాగుంది. ఆర్య అనే సినిమా సుకుమార్ తీసి ఉండకపోతే ఇవాళ అల్లు అర్జున్ ఈ స్టేజి మీద ఉండేవాడు కాదని తన స్నేహాన్ని మరోసారి చాటి చెప్పిన బన్నీ ఆయన ఇక్కడ లేకపోయినా సినిమాకు పని చేస్తూ ఉన్నట్టేనన్న భావన కలిగిస్తున్నారని అన్నాడు.
నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చని చెప్పడమే కాక ఆర్మీని ప్రేమిస్తున్నానని చెప్పి మంచి జోష్ ఇచ్చాడు. యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మొదటి రోజు మొదటి షో తమిళ హీరో సినిమా చూడాలంటే ఫస్ట్ ఛాయస్ సూపర్ స్టార్ రజనీకాంత్ అని అర్థం వచ్చేలా బాషా బాడీ లాంగ్వేజ్ ని అక్కడిక్కడే చేసి చూపించడం పేలింది. ఇంతేకాదు పుష్ప రాజ్ టైటిల్ సాంగ్ వేదిక మీద రెండు స్టెప్పులు వేయడంతో విజిల్స్ దద్దరిల్లిపోయాయి. మొత్తానికి వచ్చిన కోలీవుడ్ అభిమానులను ఆకట్టుకోవడంలో బన్నీ ఇంకో మెట్టు ఎక్కేశాడు. తమిళనాడులో భారీ ఓపెనింగ్స్ ఖాయమనే దానికి మొదటి పునాది బలంగా పడింది.
This post was last modified on November 24, 2024 11:08 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…