Movie News

30 రోజులకే ఇంటికి వస్తున్న ‘క’

దీపావళికి విడుదలై సూపర్ హిట్ కొట్టేసిన ‘క’ ఓటిటిలో వచ్చేస్తోంది. వచ్చే నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంటే సరిగ్గా నెల రోజులకు డిజిటల్ రిలీజన్న మాట. నిన్నే మలయాళం డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అక్కడి రెస్పాన్స్ సంగతి పక్కనపెడితే ఇంత త్వరగా ఒక సూపర్ హిట్ మూవీ స్మార్ట్ స్క్రీన్ పై రావడం కొత్తేమి కాదు కానీ ఇంకొన్ని రోజులు ఆగి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం. కానీ ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ‘క’ ఇంకా కొనసాగుతోంది కానీ కలెక్షన్లు నామమాత్రంగానే ఉంటున్నాయి.

అయితే ‘క’ ఓటిటి వెర్షన్ కు ఒక ప్రత్యేకత ఉంది. మొదటిసారి డాల్బీ విజన్ సినిమా, అట్మోస్ సౌండ్ తో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మంచి 4కె స్క్రీన్ ఉంటే మాత్రం బెస్ట్ క్వాలిటీని ఎంజాయ్ చేయొచ్చు. సుజీత్ సందీప్ జంటగా దర్శకత్వం వహించిన ఈ విలేజ్ థ్రిల్లర్ కు క్లైమాక్స్ ఆయువుపట్టుగా నిలిచింది. నాగ చైతన్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా రావడం, కిరణ్ అబ్బవరం ఆవేదన కలిగిన స్పీచ్ ఓపెనింగ్స్ కి బాగా దోహదపడ్డాయి. దానికి తగ్గట్టే కంటెంట్ థ్రిల్లింగ్ గా ఉండటంతో ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు.

లక్కీ భాస్కర్, అమరన్ పోటీని తట్టుకుని నిలవడం ‘క’ గర్వించాల్సిన అసలు విషయం. ట్విస్ట్ ఏంటంటే ‘క’కు రెండు మూడు రోజుల గ్యాప్ లోనే లక్కీ భాస్కర్, అమరన్ కూడా ఓటిటిలో వస్తాయన్న వార్తల నేపథ్యంలో ఈ వారం సినీ ప్రియులకు ఇంట్లోనే మూవీ ఫెస్టివల్ ఖాయమనేలా ఉంది. వీటికి సంబంధించిన ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ‘క’ సక్సెస్ తర్వాత కిరణ్ ప్రశాంతంగా ఉన్నాడు. త్వరలోనే దిల్ రుబా విడుదలకు రెడీ అవుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు ‘క’ పుణ్యమాని బిజినెస్ ఆఫర్స్ బాగుంటాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు

This post was last modified on November 24, 2024 7:56 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago