కీర్తి సురేష్ అంటే ఇంతకుముందు ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర ఉండేది. కెరీర్ ఆరంభం నుంచి ఆమె సంప్రదాయబద్ధమైన పాత్రలే చేస్తూ వచ్చింది. ‘మహానటి’తో కథానాయికగా తిరుగులేని స్థాయిని అందుకుని పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్నాక కూడా కొన్ని పరిమితుల్లోనే నటించింది. కానీ ‘సర్కారు వారి పాట’ దగ్గర్నుంచి ఆమెలోని గ్లామర్ కోణాన్ని చూస్తున్నాం. కానీ ఈ మధ్య ఆమె జస్ట్ గ్లామర్‌తో సరిపెట్టడం లేదు. ఎక్స్‌పోజింగ్ చేయడానికి కూడా వెనుకాడట్లేదు. తన డ్రెస్సింగ్ స్టైలే మారిపోయింది.
ఫొటో షూట్లలో, ఏవైనా ఈవెంట్లకు హాజరైనపుడు ఎంత సెక్సీగా కనిపిస్తోందో చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా బాలీవుడ్ ఎఫెక్టే అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఆమె వరుణ్ ధావన్ చిత్రం ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ హీరోయిన్ అంటే సూపర్ సెక్సీగా కనిపించాల్సిందే. సౌత్ హీరోయిన్లు బాలీవుడ్లో నటిస్తే వాళ్ల లుక్సే మారిపోతుంటాయి. కీర్తి సురేష్ సైతం ఆ బాటలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్న నేపథ్యంలో ఒక పోస్టర్ వదిలారు. అందులో కీర్తి లుక్ చూసి అందరూ షాకవుతున్నారు. అందులో అంత సెక్సీగా కనిపిస్తోందామె. ఇప్పటికే బయట కీర్తి లుక్స్ చూసి బాలీవుడ్ ఎఫెక్ట్.. బాలీవుడ్ ఎఫెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ పాటలో కీర్తి అనుకున్నట్లే అందాలు ఆరబోస్తే ఈ అభిప్రాయం మరింత బలపడుతుంది. ‘బేబీ జాన్’ కోసం కీర్తి లిప్ లాక్స్ కూడా చేసిందని.. కెరీర్లో ఇలా చేయడం ఇదే తొలిసారి ఇంతకుముందే వార్తలు వచ్చాయి. మరి నిజంగానే కీర్తి పెదవి ముద్దు చేసిందంటే సౌత్ జనాలు కూడా ఈ సినిమాను చూస్తారనడంలో సందేహం లేదు. తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దాని దర్శకుడు అట్లీ బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేశాడు. కాలీస్ డైరెక్ట్ చేశాడు. ఒరిజినల్లో సమంత చేసిన పాత్రను కీర్తి పోషిస్తోంది.
This post was last modified on November 23, 2024 1:57 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…