బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్స్ లో ఒకటిగా విపరీతమైన అంచనాలు మోస్తున్న వార్ 2 ద్వారా జూనియర్ ఎన్టీఆర్ హిందీ తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. దేవర ఫైనల్ రన్ పూర్తి కావడంతో తారక్ డేట్లన్నీ ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసమే కేటాయిస్తున్నాడు. ఆగస్ట్ విడుదలకు అనుగుణంగా ఫిబ్రవరిలోగా మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించేలా దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్లాన్ చేసుకుంటున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఐటెం సాంగ్ రూపంలో రాబోతోందట.
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లతో కలిసి స్త్రీ 2 భామ శ్రద్ధ కపూర్ ఆడిపాడనున్నట్టు ముంబై మీడియా టాక్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఖరారయ్యిందట. నిజానికి పుష్ప 2 ది రూల్ కోసం శ్రీలీల కన్నా ముందు తననే సంప్రదించారట. అయితే రెమ్యునరేషన్ మరీ ఎక్కువగా డిమాండ్ చేయడంతో ఆ ప్రతిపాదన మార్చుకున్నారని కొన్ని వారాల క్రితమే లీక్ వచ్చింది. అది మిస్ అయినా వార్ 2లో జోడి కావడం ఫ్యాన్స్ కి హ్యాపీనే. యష్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వార్ 2లో మతి చెడిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు డ్యూయల్ హీరోల డాన్సులు ఓ రేంజ్ లో ఉంటాయట.
దేవర ఉత్తరాదిలో హిట్ కావడంతో వార్ 2 బజ్ మరింత పెరగనుంది. ఇటీవలే మెకానిక్ రాకీ ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ తారక్ గురించి ఓ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ముందు ఎవరైనా దిగదుడుపే అనే రేంజ్ లో స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని తెగ ఊరించాడు. దీంతో హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. 2025 ఆగస్ట్ 15 విడుదల ప్లాన్ చేసుకున్న వార్ 2 తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదట. బిజినెస్ పరంగా తారక్ కున్న ఇమేజ్ దృష్ట్యా పెద్ద ఎత్తున నెంబర్లు కనిపించబోతున్నాయి. అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు ఈ కలయికను తెరమీద చూస్తామా అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on November 23, 2024 6:11 pm
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…