మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ విడుదల తేదీ మాత్రం ఇప్పటిదాకా ప్రకటించలేదు. తాజాగా రిలీజ్ చేసిన మోహన్ బాబు లుక్ లోనూ ఏ వివరం లేదు. టీజర్ వచ్చాక టీమ్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. కొంత ట్రోలింగ్ జరగడం, దాని మీద విష్ణు సీరియస్ గా రెస్పాండ్ కావడం ఇవన్నీ పాత వ్యవహారాలు. వీలైనంత త్వరగా థియేటర్లకు తీసుకువచ్చే నిర్ణయం తీసుకుంటే బెటరనేది అభిమానుల ఫీలింగ్. కానీ వాస్తవ కోణంలో ఆలోచిస్తే ఇలా జాప్యం చేయడం కూడా ఒకరకంగా మంచికే అనిపిస్తోంది.
ఎందుకంటే డిసెంబర్, జనవరి రెండు నెలలు పెద్ద సినిమాలతో పూర్తిగా ప్యాకయ్యాయి. పోటీకి వెళ్తే లేనిపోని రిస్క్. ప్రభాస్ క్యామియో చేశాడు కదా భయమెందుకు అనిపించవచ్చు. కానీ అది ఓపెనింగ్స్ కి పనికి వస్తుంది కానీ లాంగ్ రన్ రావాలంటే తక్కువ నిడివి చేసిన డార్లింగ్ సరిపోడు. అసలు కంటెంట్ మాట్లాడాలి. కానీ పబ్లిసిటీలో వాడుతున్న పోస్టర్లు ఆసక్తిని అమాంతం పెంచడంలో విఫలమవుతున్నాయి. ఇంకేదైనా వినూత్నంగా చేయాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఏర్పడుతున్న విపరీత పోటీని చూసే మంచు విష్ణు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం లేదు.
శివరాత్రి కన్నా మంచి ఆప్షన్ దొరక్కపోవచ్చు కాబట్టి వీలైనంత త్వరగా దాన్ని లాక్ చేసుకోవడం ఉత్తమం. ఇప్పటికే నితిన్ తమ్ముడు లాంటివి పండక్కు వస్తామని అధికారికంగా ప్రకటనలు ఇచ్చాయి. చివరి నిమిషంలో హడావిడి పడటం కన్నా కన్నప్ప ముందైతే డెసిషన్ తీసుకుని ఆపై ప్రమోషన్ల గురించి ఆలోచించవచ్చు. చాలా పెద్ద క్యాస్టింగ్ తో రూపొందిన కన్నప్పని వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తీశారని టాక్. థియేటర్ హక్కులు కాకుండా ఓటిటిలోనూ మంచి ఆదాయం రావాలంటే ఈ ప్రాజెక్టు మీద ఎగ్జైట్ మెంట్ కలిగించేలా ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉండాలి. అన్ని భాషల్లో ఒకే డేట్ సెట్ చేయడం కూడా సవాలే.
This post was last modified on November 22, 2024 5:11 pm
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…