టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత చై, శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీంతో, ఈ స్టార్ కపుల్ పెళ్లి ఎప్పుడు అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పెళ్లి తేదీ, వెన్యూ రివీల్ చేస్తూ అక్కినేని నాగార్జున బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు.
డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య, శోభితల పెళ్లి జరపాలని నిశ్చయించామని నాగ్ చెప్పారు. అయితే, పెళ్లి చాలా సింపుల్ గా చేసుకోవాలని వారిద్దరూ భావిస్తున్నారని, అందుకే కేవలం 400 మంది సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వారి వివాహం జరగబోతోందని నాగె వెల్లడించారు. సింపుల్ గా వివాహం చేసుకునే నిర్ణయంతో పాటు ఆ ఏర్పాట్లను కూడా వారికే వదిలేశానని తెలిపారు.
గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ 2024 అవార్డ్స్ వేడుకలలో అక్కినేని ఫ్యామిలీ సందడి చేసింది. నాగ చైతన్య తనకు కాబోయే భార్య శోభిత దూళిపాళ్లతో సందడి చేశారు. ఇక, అక్కినేని నాగార్జున, అమల జంట కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య-శోభితల పెళ్లి తేదీ, వేదికపై నాగార్జున ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం చై-శోభితల పెళ్లి డేట్ న్యూస్ వైరల్ గా మారింది.
This post was last modified on November 22, 2024 2:18 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…