కాజ‌ల్ హింట్ ఇచ్చేసిందిగా..

తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్‌గా చాలా ఏళ్ల పాటు హ‌వా సాగించి.. హిందీలోనూ భారీ చిత్రాల్లో న‌టించి దేశ‌వ్యాప్త గుర్తింపు సంపాదించిన అమ్మాయి కాజ‌ల్ అగ‌ర్వాల్. ద‌శాబ్దంన్న‌రగా కెరీర్‌ను న‌డిపిస్తూ ఇప్పటికీ పెద్ద పెద్ద సినిమాల్లో న‌టిస్తూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోందామె.

ఐతే కెరీర్ ఇంకా ముగింపు ద‌శ‌కు రాక‌ముందే ఆమె పెళ్లి గురించి ఆలోచిస్తోంద‌ని.. ఒక వ్యాపార‌వేత్త‌ను పెళ్లాడబోతోంద‌ని కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది కూడా. డిసెర్న్ లెర్నింగ్ సంస్థ సీఈవో అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లునే కాజ‌ల్‌కు కాబోయే వ‌రుడంటూ కూడా వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

వ‌చ్చే నెల‌లోనే వీరి పెళ్లి జ‌ర‌గ‌బోతున్న‌ట్లు కూడా వేడి వేడి వార్త‌లు నెట్టింట క‌నిపిస్తున్నాయి. ఈ వార్త‌లు నిజ‌మే అన్న సంకేతాలు కాజ‌ల్ కూడా ఇవ్వ‌డం విశేషం. సోమ‌వారం సాయంత్రం ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ల‌వ్ సింబ‌ల్ ఉన్న ఒక ఫొటో షేర్ చేసింది. దానికి వ్యాఖ్య‌లేమీ జోడించ‌లేదు. తాను ప్రేమ‌లో ఉన్నాన‌ని.. లేదా ఎంగేజ్ అయిపోయాన‌ని కాజ‌ల్ సంకేతాలు ఇస్తోంద‌ని.. కాబ‌ట్టి అతి త్వ‌ర‌లో ఆమె పెళ్లికూతురు కావ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేస్తున్నారు.

మ‌రి నిజంగానే కాజ‌ల్‌ వ‌చ్చే నెల‌లోనే పెళ్లి చేసుకునేట్ల‌యితే.. ఆచార్య‌, ఇండియ‌న్‌-2 లాంటి భారీ చిత్రాల‌కు ఎలా డేట్లు స‌ర్దుబాటు చేస్తూ, పెళ్లి త‌ర్వాతి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుందో చూడాలి.