ఇవాళ ఉదయం నుంచి ఒక పెద్ద సినిమా వారం రోజులు వాయిదా పడబోతోందనే వార్త సోషల్ మీడియాలో రావడంతో అందరూ పుష్ప 2 గురించే అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటికీ చివరి పాట చిత్రీకరణలో ఉన్న దర్శకుడు సుకుమార్ ఇచ్చిన టైంలోపు ఒత్తిడిని తట్టుకుని ఫైనల్ కాపీ ఇవ్వగలరానే అనుమానం జనాల్లో లేకపోలేదు. కానీ టీమ్ మాత్రం పక్కా ప్లానింగ్ తో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తోంది. ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ తమన్ అవగొట్టేశాడు. సెకండాఫ్ పనులను అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ చేస్తున్నారని టాక్. ఇంకో రెండు మూడు రోజుల్లో ఇది కూడా కొలిక్కి వచ్చేస్తుంది. ఎక్కడా ఆలస్యం లేదు.
ఇదంతా గమనించిన పుష్ప 2 బృందం తమ అఫీషియల్ హ్యాండిల్ నుంచి డిసెంబర్ 5 తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. చెప్పిన ప్రకారమే ఇచ్చిన డేట్ కి పుష్పరాజ్ ఊచకోత ఖాయమని తేల్చి చెప్పేసింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. థియేటర్ అగ్రిమెంట్లు జరిగిపోయాయి. కేరళలో ప్రీమియర్ షో టికెట్లు అమ్మేశారు. స్క్రీన్ల వారిగా లిస్టు కూడా బయటికి వచ్చింది. ఏపీ తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షో అనుమతులు వస్తే చాలు అడ్వాన్స్ బుకింగ్ త్వరగా మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఓవర్సీస్ లో ఆల్రెడీ మిలియన్ మార్క్ దాటేసింది.
సో ఏ కోణంలో చూసుకున్నా పుష్ప 2 వాయిదా పడే ఛాన్స్ ఎంత మాత్రం లేదు. పుష్ప 1కు సైతం గతంలో చివరి నిమిషం సమస్యలు వచ్చాయి. కానీ సుకుమార్ వాటిని దాటుకుని అవుట్ ఫుట్ ఇచ్చారు. అప్పుడు జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటున్నారు. కాకపోతే ఒత్తిడిని తెచ్చుకోవడాన్ని మాత్రం ఆపలేకపోయారు. భారీ ఓపెనింగ్స్ కి రంగం సిద్ధం చేసుకుంటున్న పుష్ప 2 ప్రభావం రెండు వారాల ముందే బాక్సాఫీస్ వద్ద కనిపిస్తోంది. కొత్త రిలీజులను జనం సీరియస్ గా తీసుకోవడం లేదు. బాహుబలి, కెజిఎఫ్ తర్వాత సక్సెస్ సీక్వెల్ గా పుష్ప 2 నిలుస్తుందనే ధీమా నిర్మాతల్లో ఉంది.
This post was last modified on November 22, 2024 4:03 pm
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…