గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ వేదికగా మెగాభిమానులు వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రగడ చూస్తూనే ఉన్నాం. బన్నీ నంద్యాల పర్యటన నుంచి రాజుకున్న ఈ నిప్పుని చల్లార్చడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ పూర్తి స్థాయిలో తగ్గలేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో అన్ స్టాపబుల్ సీజన్ 4లో గెస్టుగా వచ్చిన అల్లు అర్జున్ దీని గురించి ఏమైనా మాట్లాడతారేమోనని సినీ ప్రియులు ఎదురు చూశారు. దానికి తగ్గట్టే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఇద్దరూ ఫైర్ రెండో ఎపిసోడ్లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రస్తావన వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత బన్నీ మావయ్య గురించి కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడాడు.
గత ఇరవై సంవత్సరాలుగా తనకు చిరంజీవికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసని, కానీ అంతకు ముందు ఇరవై ఏళ్ళు ఆయనతో తన బాండింగ్ ఎప్పుడు చెప్పుకునే సందర్భం రాలేదు కాబట్టి ఇప్పుడు పంచుకుంటానని అన్నాడు. ఒక మనిషిగా చిరు ఫ్యాన్ అయ్యాకే మెగాస్టార్ కు అభిమానిగా మారానని, బాల్యం నుంచే మావయ్య ప్రభావం తన మీద ఎలా ఉందో ఒక ఉదాహరణ చెప్పాడు. విదేశీ పర్యటనలు ఖరీదుగా ఉన్న టైంలోనే చిరంజీవి తన పిల్లలతో పాటు బన్నీ, శిరీష్ కలిపి మొత్తం పది మందికి పైగా ఫారిన్ ట్రిప్ కి తీసుకెళ్లిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇంతమందిని తీసుకెళ్లడాన్ని గొప్పగా వివరించాడు.
అంతే కాదు చిరంజీవిని తనతో పాటు చిన్నతనంలో పిల్లలందరూ ‘చికు బాబాయ్’ అని పిలుస్తారని చెప్పడం మరో కొత్త సంగతి. ఇంత కాలం తర్వాత బన్నీ చిరంజీవి గురించి ఇంత డీటెయిల్ గా చెప్పడం మంచి విషయమే. గతంలో ఇలాంటి సందర్భం రాకపోవడం వల్లనో లేక మరేదైనా ఇతర కారణమో తెలియదు కానీ చిరు, పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడ్డం మాత్రం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలు ఎక్స్ లో చక్కర్లు కొట్టేస్తున్నాయి. పుష్ప 2 ది రూల్ విడుదల దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తి కలిగించేదే. రెండు వైపులా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, స్పందన ఎలా ఉంటుందనేది పక్కనపెడితే బాలయ్యతో బన్నీ షేర్ చేసుకున్న కబుర్లలో ఇది ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయం.
This post was last modified on November 22, 2024 11:31 am
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…