తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. అచ్చమైన తెలుగు సినిమా తీయాలంటే ఇప్పుడు ఆయన తర్వాతే ఎవరైనా. జంధ్యాల తరహాలో ఈ తరంలో తెలుగుదనం ఉట్టిపడే, సునిశితమైన హాస్యంతో ఆయన నవ్వించగలరు. ఆయనకు కెరీర్లో పెద్ద బ్రేక్ ఇచ్చిన ‘అష్టాచెమ్మా’ తరహాలో సినిమా తీస్తే చూడాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు.
జెంటిల్‌మ్యాన్, సమ్మోహనం, వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఇలా ఇంద్రగంటి చివరగా తీసిన సినిమాలన్నీ సీరియస్ టచ్ ఉన్నవే. వీటిలో ‘జెంటిల్‌మ్యాన్’, ‘సమ్మోహనం’ విజయవంతం అయ్యాయి. మిగతావి నిరాశ పరిచాయి. ‘అష్టాచెమ్మా’ తర్వాత ‘అమీతుమీ’లోనూ ఆయన వినోదాన్ని బాగా పండించారు. కొంచెం గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ ఆ శైలిలో సినిమా చేశారు. ఆ చిత్రమే.. సారంగపాణి జాతకం.
ఈ రోజే విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘సారంగపాణి జాతకం’ టీజర్ రిలీజైంది. జాతకాల పిచ్చి ఉన్న ఓ కుర్రాడు.. తన చేతిని చూసి ఒక మోడర్న్ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలను అనుసరించి తన చుట్టూ ఉన్న వారిని బెంబేలెత్తించే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మోడర్న్ జ్యోతిష్యుడిగా అవసరాల శ్రీనివాస్ నటించగా.. జాతకాల పిచ్చితో తన కుటుంబ సభ్యులు, స్నేహితులను ఉక్కిరి బిక్కిరి చేసే హీరో పాత్రను ప్రియదర్శి పులికొండ చేశాడు. టీజర్లో కాన్సెప్ట్, కామెడీ అన్నీ కూడా ‘అష్టాచెమ్మా’ను గుర్తు చేసేలా ఉన్నాయి. ఆ సినిమా మాదిరే ‘సారంగపాణి..’ కూడా అల్లరల్లరిగా సాగేలా కనిపిస్తోంది. ఇంద్రగంటి ఫన్ పవర్ మళ్లీ ఈ సినిమాలో చూడబోతున్నట్లుగా ఉంది.
టీజర్లో వెన్నెల కిషోర్ కూడా బాగా హైలైట్ అయ్యాడు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రూపా కొడయూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఇంద్రగంటితో వరుసగా సినిమాలు తీస్తున్న శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాదే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 21, 2024 3:24 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…