రౌడీ బాయ్ విజయ్ దేవరకొండని ది ఫ్యామిలీ స్టార్ తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. దాని ఫలితం నిరాశ పరిచినా ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఇటీవలే సాహిబా వీడియో సాంగ్ ద్వారా ఫ్యాన్స్ ని పలకరించాడు. అయితే నిజానికి తనకు ఇలాంటి ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడం ఇష్టం లేదు. కానీ మ్యూజిక్ కంపోజర్ జస్లీన్ రాయల్ పదే పదే అభ్యర్థించడం వల్ల ఒప్పుకున్నాడు. హీరీయే పాట ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న జస్లీన్ కంపోజ్ చేసిన సాహిబా సాంగ్ వారం తిరక్కుండానే 14 మిలియన్ల వ్యూస్ సాధించింది.
అంటే విజయ్ దేవరకొండ నమ్మకం నిజమయ్యింది. రాధికా మదన్, జైమిని పాఠక్ తో కలిసి ఇందులో భాగం పంచుకున్నాడు. దీని ప్రమోషన్లో భాగంగానే ఒక నేషనల్ మీడియా ఛానల్ తో ఈ కబుర్లు పంచుకున్నాడు. ఇదొక్కటే కాదు ఇంకొన్ని సీక్రెట్స్ కూడా చెప్పేశాడు. తాను డేటింగ్ లో ఉన్నానని, 35 ఏళ్ళ వయసులో తనను ఎవరైనా సింగల్ గా ఉన్నానని ఎలా అనుకుంటున్నారని పరోక్షంగా తన లవ్ స్టోరీని ఒప్పేసుకున్నాడు. అయితే బయట ప్రచారంలో ఉన్నట్టు రష్మిక మందన్న ప్రస్తావన మాత్రం ఎక్కడా తీసుకురాలేదు. ప్రేమను పొందానని, దాని అనుభూతిని ఆస్వాదించానని అన్నాడు.
ప్రస్తుతానికి ఫ్యాన్స్ సాహిబాతో సంతృప్తి చెందాలి. గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా నిర్మాణంలో ఉన్న విడి 12 వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కనక ఆ తేదీకి రాకపోతే విజయ్ సినిమా వాయిదా పడదు. లేదూ అంటే ఇంకో ఆప్షన్ చూసే ఛాన్స్ ఉంది. దీని తర్వాత దర్శకులు రాహుల్ సంక్రుత్యాన్, రవికిరణ్ కోలాలకు కమిట్ మెంట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి కావడానికి ఎంతలేదన్నా ఇంకో ఏడాదిన్నర పడుతుంది. ఇవి కాకుండా విజయ్ దేవరకొండ ఒప్పుకున్నవి ప్రస్తుతానికి లేవు. సాహిబా లాంటి పాటలు తన రాబోయే సినిమాల్లోనూ ఉండాలని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on November 21, 2024 4:01 pm
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…