Movie News

థియేట‌ర్ల ముందు రివ్యూలపై నిషేధం

ఈ రోజుల్లో కొత్త సినిమాల‌పై రివ్యూల ప్ర‌భావం చాలా ఉంటోంద‌న్న మాట వాస్త‌వం. బాగున్న సినిమాకు రివ్యూలు ప్ల‌స్ అవుతుంటే.. బాలేని చిత్రాల‌కు అవి మైన‌స్ అవుతాయ‌న్న విష‌యం తెలిసిందే. ఏదైనా కంటెంట్‌ను బ‌ట్టే ఉంటుంది. కానీ రివ్యూల వ‌ల్లే సినిమా దెబ్బ తింటున్న‌ట్లు ఫిలిం మేక‌ర్స్ భావిస్తుంటారు. అందుకే సినిమాకు క‌లెక్ష‌న్లు రాకుంటే రివ్యూయ‌ర్ల‌ను నిందిస్తుంటారు. శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి వాళ్లు రివ్యూయ‌ర్ల మీద‌ మ‌రీ దారుణ‌మైన భాష వాడ‌డం ఇటీవ‌ల టాలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

కాగా అటు కోలీవుడ్లోనూ రివ్యూల ప‌ట్ల వ్య‌తిరేక‌త పెరిగి.. సినిమా థియేట‌ర్ల ముందు రివ్యూలు ఇవ్వ‌డాన్ని నిషేధించే ప‌రిస్థితి త‌లెత్తింది. థియేట‌ర్లలో షో చూసి బ‌య‌టికి వ‌స్తున్న ప్రేక్ష‌కుల‌తో టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల ప్ర‌తినిధులు అభిప్రాయం తెలుసుకోవ‌డం, రివ్యూలు అడ‌గ‌డం మామూలే. షో అయిన కొన్ని నిమిషాల్లోనే ఈ మార్గంలో టాక్ బ‌య‌టికి వ‌చ్చేస్తుంటుంది.

ఐతే ఇటీవల సూర్య సినిమా కంగువ, ర‌జినీకాంత్ చిత్రం వేట్ట‌యాన్ రివ్యూల వ‌ల్లే దెబ్బ తిన్నాయ‌ని.. ఆ సినిమాలో ఉన్న కంటెంట్ కంటే ఎక్కువ నెగెటివిటీని రివ్యూల ద్వారా స్ప్రెడ్ చేశార‌ని త‌మిళ నిర్మాత‌ల మండ‌లి అభిప్రాయ‌ప‌డింది. అందుకే థియేట‌ర్ల ద‌గ్గ‌ర రివ్యూలు చెప్పడాన్ని, ప్రేక్ష‌కుల నుంచి అభిప్రాయం తెలుసుకోవ‌డాన్ని నిషేధిస్తున్న‌ట్లు త‌మిళ నిర్మాత‌ల మండ‌లి ప్ర‌క‌టించింది. రివ్యూల వ‌ల్ల సినిమాల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతోంద‌ని, దీనికి అడ్డు క‌ట్ట ప‌డాల‌ని నిర్మాత‌ల మండ‌లి అభిప్రాయ‌ప‌డింది.

ఐతే ఈ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కంగువ బ్యాడ్ మూవీ అనే విష‌యంలో ఎవ‌రికీ సందేహాలు లేవ‌ని.. వేట్ట‌యాన్ కూడా గొప్ప సినిమా ఏమీ కాదు క‌దా అని అంటున్నారు. ప్రేక్ష‌కులు ఎలాగోలా టాక్ తెలుసుకునే సినిమాకు వెళ్లాలా వ‌ద్దా అన్న‌ది నిర్ణ‌యించుకుంటార‌ని.. ఇలా థియేట‌ర్ల ద‌గ్గ‌ర‌ రివ్యూల‌ను నియంత్రించినంత మాత్రాన ఏమీ మారిపోంద‌ని అంటున్నారు నెటిజన్లు.

This post was last modified on November 21, 2024 12:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

2 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

10 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

13 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

14 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

14 hours ago