ఓటిటిలో విడుదలయ్యే సినిమాలకి కొన్ని ఖచ్చితమైన లక్షణాలుండాలి. ముఖ్యంగా ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టే థ్రిల్లింగ్ అంశాలుండాలి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసే కమర్షియల్ సినిమాలు ఈ ప్లాట్‍ఫామ్‍లో వర్కవుట్ అవ్వవు.
ఉదాహరణకు ఒక మాస్ కామెడీ సీన్ చూస్తున్నపుడు అందరికీ నవ్వు రాదు. అది అందరితో కలిసి చూస్తున్నపుడు మిగతా వాళ్ల నవ్వులను బట్టి ఆ సీన్ మరోలా అనిపిస్తుంది. అదే దానిని ఒక్కరే కూర్చుని చూస్తే ఎంజాయ్ చేయలేరు. అలాగే థియేటర్స్ లో విజిల్స్ పడే కొన్ని సీన్లు, డైలాగులుంటాయి. అవి ఆ అట్మాస్ఫియర్ లేకుండా ఇంట్లో చూస్తే వర్కవుట్ అవ్వవు.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చేవి దాదాపుగా కమర్షియల్ చిత్రాలే కనుక ఓటిటి రిలీజ్ వాటికి కరక్ట్ కాదు. ఇటీవల ఓటిటిలో విడుదలైన సినిమాలకు వచ్చిన రెస్పాన్స్తో ఆల్రెడీ ఓటిటి రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాల వాళ్లు కూడా వెనక్కి తగ్గుతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని ముందుగా ఓటిటి రిలీజ్ చేసేద్దామని అనుకున్నారు. కానీ థియేటర్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి కనుక కొద్ది రోజులు ఆగితే థియేటర్స్లోనే విడుదల చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు.
అక్టోబర్, నవంబర్‍లో కాకపోయినా కనీసం డిసెంబర్‍లో అయినా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సాయి ధరమ్ తేజ్ అడుగుతున్నాడట. థియేట్రికల్ రైట్స్ కూడా జీ సంస్థ దగ్గరే వున్నాయి కనుక, ఇటీవలి ఫలితాలు చూసి వాళ్లు కూడా ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకునే అవకాశాలయితే లేకపోలేదు.
This post was last modified on October 5, 2020 3:55 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…