ఒక పెద్ద హీరో కొడుకు అంటే ఆటోమేటిగ్గా హీరో అవ్వాల్సిందే. ఒకప్పుడైనా హీరోల కొడుకులు వేరే మార్గాల వైపు చూసేవారు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం తండ్రుల వారసత్వాన్నే కొనసాగిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఒక దశలో సినిమాల్లోకి వచ్చేలానే కనిపించలేదు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని హీరోగా పరిచయం అవుతున్నాడు.
ఇలాంటి తరుణంలో బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన షారుఖ్ ఖాన్.. తన కొడుకుని దర్శకుడిగా పరిచయం చేస్తుండడం విశేషం. షారుఖ్ పెద్ద కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అరంగేట్రం చేయబోతుండడం విశేషం. స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ కోసం ఆర్యన్ ఖాన్ ఒక వెబ్ సిరీస్ చేస్తుండడం విశేషం. దీని గురించి షారుఖ్ అధికారికంగా వెల్లడించాడు.
తన సొంత సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బేనర్ మీద తన భార్య గౌరీ ఖాన్.. నెట్ ఫ్లిక్స్‌తో కలిసి ప్రొడ్యూస్ చేయనున్న సిరీస్‌తో ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడని.. ఒక కొత్త కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నామని.. ఇది తమకు చాలా ప్రత్యేకమైన రోజు అని సిరీస్ మొదలవుతున్న సందర్భంగా షారుఖ్ పోస్ట్ పెట్టాడు.
ఆర్యన్ ఖాన్ కొన్నేళ్ల కిందట డ్రగ్స్ వివాదంలో చిక్కుకుని బాగా అన్ పాపులర్ అయ్యాడు. ఆర్యన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినపుడు షారుఖ్ కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. చివరికి ఈ కేసులో ఆర్యన్ నిర్దోషిగా బయటికి వచ్చాడు. ఆ తర్వాత అతను వార్తల్లో లేడు. ఏదో ఒక రోజు అతను హీరోగా పరిచయం అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఆర్యన్ మెగా ఫోన్ పట్టాడు. మరి దర్శకుడిగా అతనెలాంటి ముద్ర వేస్తాడన్నది ఆసక్తికరం.
This post was last modified on November 20, 2024 7:25 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…