‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు ముందు ఆ సినిమాకు సంబంధించి అత్యంత హైలైట్ అయింది ఎవరు అంటే.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అనే చెప్పాలి. ఈ ముంబయి భామ అంద చందాలను హైలైట్ చేస్తూ వదిలిన ప్రోమోలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్‌కు మోడర్న్ రాఘవేంద్రరావు అనే పేరు కూడా వచ్చింది.
ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే భాగ్యశ్రీకి అవకాశాలు వెల్లువెత్తుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ తర్వాత మొత్తం కథ మారిపోయింది. ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ బాగానే హైలైట్ అయినా.. సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె గురించి మాట్లాడేవారు కరవయ్యారు. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా మినహా మరే చిత్రంలోనూ ఆమె రోల్ ఖరారవ్వలేదు. దీంతో భాగ్యశ్రీ కెరీర్ అనుకున్నంత వేగం పుంజుకునేలా కనిపించలేదు.
కానీ కొంచెం గ్యాప్ తర్వాత భాగ్యశ్రీకి ఓ మంచి అవకాశం వచ్చింది. రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ అవకాశం అందుకుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో మంచి విజయాన్నందుకున్న మహేష్ బాబు.పి దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. గురువారమే ఈ సినిమాకు ముహూర్త వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ఇందులో కథానాయికగా భాగ్యశ్రీని ఖరారు చేస్తూ టీం అధికారిక ప్రకటన చేసింది.
మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన రామ్‌తో సినిమా అంటే భాగ్యశ్రీకి మంచి అవకాశమే. వరుసగా మాస్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న రామ్.. ఈసారి మహేష్ దర్శకత్వంలో క్లాస్ టచ్ ఉన్న వెరైటీ సినిమా ఏదో చేస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.
This post was last modified on November 20, 2024 5:06 pm
సందీప్ రెడ్డి వంగ సినిమాలకు, అనిల్ రావిపూడి తీసే చిత్రాలకు అస్సలు పొంతన ఉండదు. కానీ సందీప్ అంటే అనిల్‌కు…
ఈ రోజుల్లో ఆడియో క్యాసెట్లు, సీడీలు లేవు. వాటి అమ్మకాలూ లేవు. ఆడియో ఫంక్షన్లూ లేవు. అలాంటపుడు ఆడియోలకు ఏం…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తెలుగు మాట్లాడేందుకు కాస్తంత ఇబ్బంది…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ మ్యానిఫెస్టోను విడుదల చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన కూటమి సర్కారు సింగిల్ పైసా పెట్టుబడులు కూడా రాబట్టలేదని విపక్షం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని జనసేన నేత కిరణ్ రాయల్ తో పాటు పలువురు నేతలు,…