ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల విషయంలో ఇది బాగా బయటపడుతుంది. పుష్ప 2 ది రూల్ ట్రైలర్ ఎంత వేగంగా బోలెడన్ని షాట్లు, సీన్లతో అల్ట్రా ఫాస్ట్ గా పరుగులు పెట్టడం చూశాం. అంచనాలు పెంచే విషయంలో దర్శకుడు సుకుమార్ తగ్గేదేలే తరహాలో తన మార్కు మేకింగ్ తో అదరగొట్టేశాడు. వీలైనంత వరకు కథకు సంబంధించిన క్లూలు, లీకులు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు కానీ 0.25 స్లో స్పీడ్, ఫ్రీజ్ షాట్ల రూపంలో అధ్యయనం చేశాక కొన్ని ట్విస్టులు బయటపడ్డాయి.
వాటిలో ఒకటి భారీ వర్షం పడుతుండగా, వేలాది మంది స్మశానంలో గుమికూడి ఉండగా ఎర్రచందనం దుంగల మీద ఒక మృతదేహానికి అంత్యక్రియలు జరగడం. సన్నివేశం మొత్తం గొడుగులతో నిండిపోయింది. ఇంత పెద్ద సెటప్ అంటే స్టోరీ ప్రకారం చాలా కీలకమైన ఆర్టిస్టు అయ్యుండాలి. మొదటి అంచనా శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్న. ఇదే ట్రైలర్ లో ఒక చోట బన్నీ చీర కట్టుకుని ఫైట్ చేయడం కనిపిస్తుంది. అంటే శ్రీవల్లిని హత్య చేసి ఉంటే దానికి ప్రతీకారంగా ఆమె బట్టలే వేసుకుని శత్రువును ముట్టడించాడన్న మాట. సునీల్, అనసూయ లాంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ఆ షాట్ లోనే ఉన్నారు కాబట్టి.
పుష్ప ఫ్రెండ్ గా చేసిన జగదీశ్ కు ప్రాధాన్యం పెరిగినా ఇంత బిల్డప్ ఇచ్చే ఎపిసోడ్ పెట్టి ఉండరు. డాలీ ధనుంజయ్, రావు రమేష్ లను కూడా గెస్ చేయొచ్చు కానీ సెటప్ విషయంలోనే అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ కెజిఎఫ్ 2 లాగా పుష్పకు ఏమైనా షాకింగ్ ముగింపు ఇచ్చారా అనేది కూడా సస్పెన్సే. పుష్ప 3 కోసం ఓపెన్ క్లైమాక్స్ పెడతారనే టాక్ గతంలోనే ఉంది కాబట్టి అది కాకపోవచ్చు. సో ఎక్కువ అవకాశాలు శ్రీవల్లికే ఉన్నాయి. పుష్పరాజ్ విశ్వరూపానికి దారి తీసే కారణం ఇదే కావొచ్చు. చూడాలి మరి ఇక్కడ విశ్లేషణ చేసినట్టే పుష్ప 2 ట్విస్టు ఉంటుందా లేక సుకుమార్ ఏదైనా షాక్ ఇస్తారానేది.
This post was last modified on November 18, 2024 3:26 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…