Movie News

జోష్ సరిపోతుందా రాకీ

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఎక్కువ ఎడ్జ్ ఉన్నది మెకానిక్ రాకీకే. విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. అయితే పుష్ప 2 ది రూల్ వేడుక టైంలోనే ఇదీ ఉండటంతో ప్రేక్షకుల దృష్టి ఎక్కువ ఇటు వైపు పడలేదు. అందుకే థియేట్రికల్ రిలీజ్ ట్రైలర్ ని సోమవారానికి సెట్ చేసుకున్నారు. ఎప్పటిలాగే విశ్వక్ ఈసారి కూడా కొన్ని మెరుపులు, సెటైర్లతో కూడిన స్పీచ్ మాట్లాడాడు. కాకపోతే శపథాలు, ఛాలెంజులు గట్రా లేకుండా ఈసారి తనను టార్గెట్ చేసే వారికి వెరైటీగా వార్నింగులు గట్రా ఇచ్చాడు.

మెకానిక్ రాకీనే కాదు ఏ సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా చొక్కా విప్పి తిరగడాలు, ఫిలిం నగర్ ఇల్లు ఖాళీ చేయడాలు లాంటివి ఉండవని, నేనింతేలో రవితేజ చెప్పినట్టు ఫలితంతో సంబంధం లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు. రివ్యూల మీద కాస్తా ఘాటుగానే స్పందిస్తూ సహేతుకంగా విమర్శిస్తే ఎలాంటి ఇబ్బంది లేదని, పర్సనల్ గా టార్గెట్ చేసుకుంటే మాత్రం వీపు మిగులుతుందని హెచ్చరిక చేశాడు. నిజానికి అలా కావాలని బురద చల్లుతున్నది ఎవరో కానీ ప్రతిసారి ప్రీ రిలీజ్ ఈవెంట్లతో నన్ను అణిచేస్తున్నారు, ఇంకా ఎదిగి చూపిస్తానని చెప్పడం మాత్రం రిపీట్ అవుతోంది.

సరే దీని సంగతి ఎలా ఉన్నా మెకానిక్ రాకీకి సాలిడ్ ఓపెనింగ్స్ రావాలంటే మొదటి రోజు టాక్ చాలా కీలకం. దీపావళి సినిమాలు మూడు సూపర్ హిట్టయ్యాక మళ్ళీ బాక్సాఫీస్ వద్ద జోష్ తగ్గిపోయింది. కంగువ పెద్ద షాక్ ఇస్తే మట్కా ఊసులో లేకుండా పోయింది. వీటిని మూవీ లవర్స్ సీరియస్ గా తీసుకోలేదు. ఈ గ్యాప్ ని మెకానిక్ రాకీ వాడుకోవాలి. దేవకీనందన వాసుదేవ, జీబ్రాలతో పోటీ ఉన్నప్పటికీ వాటి హీరోల కంటే విశ్వక్ సేన్ ఇమేజ్, మార్కెట్ రెండూ పెద్దవి కనక ఆ అడ్వాంటేజ్ ని తీసుకోవాలి. కమర్షియల్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందిన మెకానిక్ రాకీకి జేక్స్ బెజోయ్ సంగీతం ప్రధాన ఆకర్షణట.

This post was last modified on November 18, 2024 10:59 am

Share
Show comments

Recent Posts

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

24 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

5 hours ago