టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్ షీట్లు అంత సులభంగా దొరికేంత ఖాళీ అయితే లేదు. అయితే వరస సక్సెస్ లు పడితే వచ్చే కిక్కే వేరు. రెమ్యునరేషన్లు పెరుగుతాయి. స్టార్ హీరోల దృష్టిలో పడొచ్చు. డిమాండ్ తగ్గట్టు ఇతర బాషల ఆఫర్లు వస్తాయి. కానీ మీనాక్షి చౌదరి పరిస్థితి ఒక పండు దక్కితే వెంటనే ఒక కాయ తినాలనేలా తయారయ్యింది. గుంటూరు కారంలో గుర్తింపు లేని పాత్ర చేశాక ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలోనూ గుర్తుంచుకునే క్యారెక్టర్ పడలేదు. ఇటీవలే లక్కీ భాస్కర్ రూపంలో పెద్ద లక్కు దొరికింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన ఈ మనీ క్రైమ్ డ్రామా వంద కోట్ల గ్రాస్ దాటేసి తెలుగు, తమిళ, మలయాళంలో జయకేతనం ఎగరేసింది. అమరన్ పోటీని తట్టుకుని విజేతగా నిలవడం మాములు విషయం కాదు. మీనాక్షి చౌదరికి భాస్కర్ భార్యగా మంచి గుర్తింపు దక్కింది. కట్ చేస్తే తక్కువ గ్యాప్ లో మరోసారి మట్కా రూపంలో ప్రేక్షకులను పలకరించింది. రివ్యూ, టాక్స్ నిరాశాజనకంగా ఉన్నాయి. కంటెంట్ సంగతి పక్కన పెడితే నిడివి పరంగా మీనాక్షికి కాసిన్ని మంచి సీన్లు పడ్డాయి కానీ స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా సాగడం వల్ల అవేవి పెర్ఫార్మన్స్ పరంగా ఏ మాత్రం ఉపయోగపడలేకపోయాయ.
దానికి తోడు వరుణ్ తేజ్ భార్యగా సెకండాఫ్ లో తన పాత్రకు ఇచ్చిన ముగింపు కూడా సోసోనే. అలా లక్కీ భాస్కర్ ఇచ్చిన ఆనందం వైజాగ్ వాసు ఆవిరి చేశాడన్న మాట. అయితే వారం తిరక్కుండానే నవంబర్ 22 విశ్వక్ సేన్ మెకానిక్ రాకీలో మళ్ళీ కనిపించనుంది. ఈసారి యూత్ టచ్ ఎక్కువగా ఉండనుంది. శ్రద్ధ శ్రీనాథ్ మరో హీరోయిన్ అయినప్పటికీ ప్రాధాన్యం ఉంటుందట. ఇది హిట్టు కొడితే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేయొచ్చు. మీడియం రేంజ్ హీరోలకు మంచి ఛాయస్ గా మారిన మీనాక్షి చౌదరికి సాలిడ్ గా ఒకటి రెండు బ్లాక్ బస్టర్లు పడితే టాప్ లీగ్ లోకి వెళ్లిపోవచ్చు. కానీ కోసమే ఎదురు చూస్తోంది.
This post was last modified on November 15, 2024 2:07 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…