ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న పెద్ద సినిమాల్లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు ఫ్యామిలీకి ఈ సినిమా ఎంత ప్రతిష్టాత్మకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా గురించి పది పదిహేనేళ్ల నుంచి మోహన్ బాబు, విష్ణు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఎప్పటికైనా దీన్ని పట్టాలెక్కిస్తామని చెబుతూ వచ్చిన మంచు కుటుంబం గత ఏడాదే తమ కలను నెరవేర్చుకుంది.
వంద కోట్లకు పైగా బడ్జెట్లో, భారీ తారాగణంతో ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు. షూట్ కొన్ని నెలల ముందే పూర్తయింది కానీ.. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ సినిమా కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతోంది. చివరగా మీడియాతో మాట్లాడినపుడు ‘కన్నప్ప’ను డిసెంబరులో విడుదల చేయబోతున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు. కానీ డిసెంబరు దగ్గర పడుతున్నా ఇప్పుడు సినిమా గురించి సౌండ్ లేదు.
తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు.. ‘కన్నప్ప’ రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ముందు చెప్పినట్లు తమ సినిమాను డిసెంబరులో రిలీజ్ చేయట్లేదని చెప్పాడు. కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేశామని.. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకులను పలకరిస్తుందని విష్ణు వెల్లడించాడు.
డిసెంబరులో పోటీ కొంచెం గట్టిగానే ఉంది. తొలి వారంలో ‘పుష్ప-2’ రాబోతోంది. దాని మేనియా రెండు వారాలైనా సాగుతుంది. ఇక క్రిస్మస్‌కేమో ‘రాబిన్ హుడ్’ సహా నాలుగైదు చిత్రాలు పోటీలో ఉన్నాయి. అసలు డిసెంబరుకు సినిమాను రెడీ చేయడమే కష్టంగా ఉండగా.. పోటీని కూడా దృష్టిలో ఉంచుకుని ‘కన్నప్ప’ను వాయిదా వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉన్న నేపథ్యంలో బాగా పబ్లిసిటీ చేసి, మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేయాలని విష్ణు అండ్ టీం భావిస్తోంది.
This post was last modified on November 15, 2024 6:05 am
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…