మాస్ రాజా రవితేజ కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. ఇంతకుముందు తనకు ‘వీర’ లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ.. దర్శకుడు రమేష్ వర్మను నమ్మి అతడితో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు రవితేజ. రమేష్ వర్మతో వరుసగా అసోసియేట్ అవుతున్న నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
తన సినిమాల్లో ఆకర్షణీయమైన హీరోయిన్లను పెట్టడం రమేష్ వర్మకు అలవాటు. రవితేజ సినిమాకు ఒకరికిద్దరు యంగ్, హాట్ బ్యూటీస్‌ను కథానాయికలుగా సెట్ చేశాడట అతను. ఆ ఇద్దరూ నిధి అగర్వాల్, అను ఇమ్మాన్యుయెల్.
‘సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో కెరీర్ ఆరంభంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ.. ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ సక్సెస్ అందుకుని క్రేజీ హీరోయిన్‌గా మారింది నిధి.
ఇక అను విషయానికొస్తే మొదట్లో మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి చిన్న సినిమాలు చేసినా.. ఆ తర్వాత నా పేరు సూర్య, అజ్ఞాతవాసి లాంటి భారీ చిత్రాల్లో నటించింది. ఐతే ఒక దశలో వరుసగా డిజాస్టర్లు ఎదురవడంతో అను కెరీర్లో బ్రేక్ వచ్చింది. ఈ మధ్యనే ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా అవకాశం అందుకుందామె. వెంటనే ఇప్పుడు రవితేజ సినిమాతో ఛాన్స్ పట్టేసింది.
రమేష్ వర్మ ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే తీస్తుంటాడు. రవితేజకు సెట్టయ్యేవి కూడా ఆ టైపు సినిమాలే. ఇక ఇద్దరు హాట్ హీరోయిన్లు దీనికి తోడయ్యారంటే మాస్ ప్రేక్షకులకు మాంచి వినోదం గ్యారెంటీ అన్నమాటే. ప్రస్తుతం మాస్ రాజా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది మరికొన్ని రోజుల్లో పూర్తవుతుంది. వెంటనే రమేష్ వర్మ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు.
This post was last modified on October 4, 2020 6:49 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…