ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమాయణాలు.. బ్రేకప్‌లు సర్వ సాధారణమే. ఐతే బాలీవుడ్లో ఈ ఒరవడి ఎక్కువ కాగా.. సౌత్ ఇండస్ట్రీల్లో కొంచెం తక్కువ. సౌత్ సినిమాల్లో పని చేసే హీరో హీరోయిన్లు తమ ప్రేమాయణాల గురించి.. బ్రేకప్ స్టోరీల గురించి పెద్దగా ఓపెన్ కారు. ఐతే పేరుకు నార్త్ ఇండియా అమ్మాయే అయినప్పటికీ.. సౌత్ సినిమాలతోనే మంచి పేరు సంపాదించిన రాశి ఖన్నా.. లేటెస్ట్‌గా తన బ్రేకప్ స్టోరీ గురించి మీడియా ముందు ఓపెన్ అయింది.
తాను ఎవరితో ప్రేమలో పడిందో చెప్పలేదు కానీ.. బ్రేకప్ వల్ల తాను పడ్డ బాధ గురించి మాత్రం ఆమె పంచుకుంది. “వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్‌గా ఉంటాను. గతంలో నాకో ప్రేమకథ ఉండేది. కొన్ని కారణాల వల్ల మేం బ్రేకప్ అయ్యాం. ఆ సమయంలో ఎంతో బాధ పడ్డా. డిప్రెషన్‌కు గురయ్యాను. కానీ కొన్నాళ్లకు నన్ను నేను మార్చుకున్నాను. బలంగా నిలబడ్డాను. కెరీర్ మీద దృష్టిపెట్టా” అని రాశి ఖన్నా చెప్పింది. ఇండస్ట్రీలో కంటే తనకు బయటే స్నేహితులు ఎక్కువ అని చెప్పిన రాశి.. కష్ట కాలంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలిచారని తెలిపింది.
ఇక ఒక సినిమా హీరోయిన్‌కు స్టార్ డమ్ ఎలా ఉంటుందో తన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ రిలీజైన కొన్ని రోజులకు తెలిసిందని రాశి చెప్పింది. “నా తొలి చిత్రం రిలీజయ్యాక మేం తిరుపతికి వెళ్లాం. ఒక్కసారిగా జనం పెద్ద ఎత్తున మమ్మల్ని చుట్టుముట్టారు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మేనేజర్‌ను అడిగితే వాళ్లంతా నన్ను చూడ్డానికే వచ్చారని చెప్పాడు. నేను షాకయ్యా. ఆ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను. ఫేమ్ గురించి నాకు అప్పటిదాకా తెలియదు. రాను రాను అలవాటు చేసుకున్నా” అని రాశి చెప్పింది. ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన రాశికి ప్రస్తుతం కొంచెం వెనుకపడింది. సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తున్న ‘తెలుసు కదా’ మాత్రమే ఆమె చేతిలో ఉన్న తెలుగు సినిమా.
This post was last modified on November 13, 2024 2:58 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…