సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ మాండేటరీ. ‘1 నేనొక్కడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్లో కూడా ఆయన ఐటెం సాంగ్ పెట్టారు. దానికి ముందు తర్వాత కూడా ఆయన సినిమాల్లో ఐటెం సాంగ్ చూడొచ్చు. ‘పుష్ప: ది రైజ్’లో సమంత చేసిన ‘ఊ అంటావా’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దీని సీక్వెల్ ‘పుష్ప: రూల్’లో కూడా ఐటెం సాంగ్ ఆనవాయితీని కొనసాగిస్తున్నాడు సుక్కు. ఐతే ఈ పాటలో ఎవరు నర్తిస్తారనే విషయంలో చాన్నాళ్ల పాటు సస్పెన్స్ నడిచింది.
ఒక దశలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బన్నీతో కలిసి స్టెప్పులేస్తుందని వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఆమె స్థానంలోకి శ్రీ లీల వచ్చింది. ఆమెతోనే ఐటెం సాంగ్ తీస్తున్నారు. ఆ పాట చిత్రీకరణ కూడా పూర్తి కావచ్చింది. ఐతే శ్రద్ధా కపూర్ దాదాపుగా ఓకే అయ్యాక ఆమె ఎందుకు ఈ పాటలో నర్తించలేదా అని ఆరా తీస్తే తను డిమాండ్ చేసిన భారీ పారితోషకమే కారణమని తెలిసింది. శ్రీలీల చాలా తక్కువ పారితోషకానికే ఈ పాట చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐతే శ్రీలీలను ఈ పాటకు ఎంచుకోవాలన్నది దర్శకుడు సుకుమార్ ఆలోచన కాదట. ఇది హీరో బన్నీ ఛాయిస్ అని సమాచారం. బన్నీ ఇంతకుముందే శ్రీలీలతో కలిసి ‘ఆహా’ కోసం ఒక యాడ్ చేశాడు. ఇక ఆమె సూపర్ డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడైన బన్నీ.. శ్రీలీలతో కలిసి ఆడి పాడితే డ్యాన్స్ ఫ్లోర్ హీటెక్కిపోవడం ఖాయం. అందుకే ఆమెను ఈ పాట కోసం బన్నీనే ఓకే చేశాడని.. సుకుమార్ కూడా సరే అనడంతో ఈ పాటలో ఆమె భాగం అయిందని సమాచారం.
బన్నీ-శ్రీలీల కాంబో మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు ఉంటాయని సమాచారం. ఈ పాటలో హీరోయిన్ రష్మిక సైతం తళుక్కుమంటుందట. మామూలుగా ఐటెం సాంగ్స్‌లో హీరోయిన్లు కనిపించరు. కానీ ఇందులో మాత్రం రష్మిక కూడా భాగమేనట. బన్నీ ఈ పాటను పూర్తి చేశాక.. రష్మికతో కలిసి మరో పాట చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. దీంతో పాటు కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండగా వారం రోజుల్లో అంతా పూర్తి చేసి చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవగొట్టి నెలాఖరుకు ఫస్ట్ కాపీ రెడీ చేయాలని టీం చూస్తోంది.
This post was last modified on November 13, 2024 2:56 pm
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…