వచ్చే వారం నవంబర్ 22 విడుదల కాబోతున్న జీబ్రాని సత్యదేవ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. సోలో హీరోగా బ్లఫ్ మాస్టర్ తప్ప చెప్పుకోదగ్గ గుర్తింపు రాని పరిస్థితుల్లో దీంతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న సంకల్పంతో ఉన్నాడు. అయితే బజ్ పరంగా ప్రేక్షకుల్లో అంచనాలు రేపడం అంత సులభం కాదు. అందుకే ఆసక్తికరమైన ట్రైలర్ తో దాన్ని సగం వరకు నెరవేరిస్తే మిగిలింది చిరంజీవి ముఖ్య అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం ద్వారా పూర్తి చేశారు. నిన్న జరిగిన వేడుకలో చాలా మెరుపులు, చమక్కులు చోటు చేసుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ వీడియోలే జీబ్రా వైపు చూసేలా చేసాయి.
మాములుగా ఇలాంటి ఫంక్షన్స్ కు వచ్చినప్పుడు చిరంజీవి స్పీచులు పెద్దరికం నింపుకుని ఎక్కువ శాతం సీరియస్ గా ఉంటాయి. కుర్రాళ్లకు సలహాలు ఇవ్వడం లాంటివి చూడొచ్చు. కానీ నిన్న మాత్రం మెగాస్టార్ లోని సరదా యాంగిల్ బయటికి వచ్చింది. ఒక వైజాగ్ అభిమాని అరుపుని గమనించి తన వింటేజ్ స్టైల్ లో స్టేజి మీద ఆ ప్రాంతం యాసలో మాట్లాడ్డం బాగా పేలింది. సత్యదేవ్ తో అనుబంధం, గాడ్ ఫాదర్ లో విలన్ గా చేసినప్పుడు కలిగిన అనుభవంతో పాటు మత్తువదలరా 2, కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, హనుమాన్ లాంటి స్టార్లు లేని సినిమాలు బ్లాక్ బస్టర్లు కావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఎన్నో విషయాలు పంచుకున్న చిరంజీవి గురించి జీబ్రాలో నటించిన కీలక నటీనటులు , సాంకేతిక నిపుణులు ఇచ్చిన ఎలివేషన్లు ఎప్పట్లాగే అభిమానుల నుంచి క్లాప్స్ అందుకున్నాయి. జీబ్రా మీద ఆడియన్స్ లో అంచనాలు రేపేందుకు ఈ ఈవెంట్ బాగా ఉపయోగపడింది. పుష్ప ఫేమ్ డాలీ ధనుంజయ్ మరో కీలక పాత్ర పోషించిన ఈ యాక్షన్ కం క్రైమ్ థ్రిల్లర్ కు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించగా కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. మెకానిక్ రాకీ, దేవకీనందన వాసుదేవలతో పోటీ ఎదురుకోబోతున్న జీబ్రా కంటెంట్ నే నమ్ముకుంది దిగుతోంది. సత్యదేవ్ లక్ ఎలా ఉండబోతోందో.
This post was last modified on November 13, 2024 10:56 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…