రేపు విడుదల కాబోతున్న కంగువకు కష్టాల పరంపర కొనసాగుతోంది. తమిళనాడులో అమరన్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల మూడో వారంలోనూ దానికి స్క్రీన్లు కేటాయించాలని నిర్ణయించుకోవడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఫ్యాన్స్ ఇప్పటికే టెన్షన్ పడుతున్నారు. ఇటు చూస్తేనేమో తెలుగు వెర్షన్ కు సైతం చిక్కొచ్చి పడింది. ఇప్పటిదాకా ఏషియన్, పివిఆర్, మిరాజ్ తదితర కార్పొరేట్ చైన్లకు సంబంధించిన మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లలో కంగువ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. పర్సెంటేజ్ షేరింగ్ విషయంలో మైత్రితో ఏర్పడిన ఇబ్బందుల వల్లే టికెట్ల అమ్మకం మొదలుకాలేదని తెలిసింది.
ఒక్క హైదరాబాద్ మాత్రమే చూసుకున్నా ఇప్పటిదాకా కంగువకు పట్టుమని రెండు వందల షోల కేటాయింపు జరగలేదు. కొన్ని ప్రీమియం స్క్రీన్ల కోసమే ఎదురు చూసే ప్రేక్షకులు ఉంటారు. కానీ ఆలస్యం జరిగే కొద్దీ మనసు మార్చుకోవడమో లేదా పోటీలో ఉన్న ఇతర రిలీజులకు వెళ్లిపోవడమో జరుగుతుంది. సూర్య కెరీర్ లోనే అత్యంత ఖరీదయిన ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కంగువ అటు హిందీలోనూ బుకింగ్స్ ఆలస్యం కావడం గాయం మీద కారం చల్లినట్టు అయ్యింది. మొన్నో ప్రెస్ మీట్ లో బాలీవుడ్ రిపోర్టర్ ప్రత్యేకంగా దీని గురించే ప్రస్తావించడం గమనించాల్సిన విషయం.
కోలీవుడ్ బాహుబలిగా అంచనాలున్న కంగువ ఇలా జరగడం పట్ల అభిమానులు కలత చెందుతున్నారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా వెయ్యి కోట్లకు వసూళ్లు తక్కువ రావన్న ధీమాని చూపిస్తుండగా వాస్తవ పరిస్థితి దానికి మద్దతు ఇచ్చేలా లేదు. ఒక చోట అయితే ఏదో అనుకోవచ్చు. కానీ శాపం వెంటాడినట్టు ఒకదాని వెంట మరొకటి చిక్కులు వస్తూనే ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నంలోపు కంగువ నైజామ్ సమస్యని తీర్చేలా పెద్దల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. సిరుతై శివ దర్శకత్వం వహించిన కంగువలో దిశా పటాని, బాబీ డియోల్ లాంటి భారీ క్యాస్టింగ్ తో పాటు దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
This post was last modified on November 13, 2024 4:16 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…