దగ్గుబాటి రానా అంటే కేవలం నటుడు కాదు. తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నిర్మాత కూడా. ఐతే అతను పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలేమీ చేయడు. తనే ప్రొడక్షన్ అంతా చూసుకోడు. చిన్న సినిమాలకు తెర వెనుక ఉండి నడిపిస్తాడు. 35 లాంటి మంచి కథలకు సపోర్ట్ చేసి రీచ్ పెంచుతూ ఉంటాడు. గతంలో కేరాఫ్ కంచరపాలెం సహా పలు సినిమాలకు ఇలాంటి సహకారమే అందించాడు.
ఎవరైనా మంచి కథతో వచ్చినా, మంచి సినిమా చేసినా రానా మద్దతు ఉంటుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. అలాగే చిన్న సినిమాల ప్రమోషన్లకు కూడా రానా వచ్చి సాయం అందిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే అతడి మీద ప్రశంసల జల్లు కురిపించాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. ఇండస్ట్రీలో చాలామంది కొత్త వాళ్లకు రానా పెద్ద దిక్కు అని సందీప్ వ్యాఖ్యానించడం విశేషం.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్‌కు రానాతో పాటు సందప్ అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సందీప్ తన ప్రసంగం చివర్లో రానా మీద ప్రశంసల జల్లు కురిపించాడుచాలా రోజుల నుంచి వేదిక మీద మాట్లాడే అవకాశం వస్తే ఈ మాట చెబుదామని ఎదురు చూస్తున్నా. నిజంగానే చెబుతున్నా. చాలామందికి పెద్ద దిక్కు రానానే. వేరే వాళ్లకే కాదు.. నాకు కూడా అతనే పెద్ద దిక్కు. ఈ మధ్య కొందరుయంగ్ హీరోలు తమకు సరైన సపోర్ట్ సిస్టమ్ లేదని బాధ పడడం చూశా. అలాంటి వాళ్లందరికీ రానా నంబర్ ఇస్తా. ఒక్క ఫోన్ చేయండి చాలు. అతను వచ్చేస్తాడు. అంతే కాక మాలాంటి వాళ్లందరినీ కూడా ప్రమోషన్ కోసం తీసుకొస్తాడు అంటూ సందీప్ కిషన్ నవ్వేశాడు. రానా ఈ మాటలకు సిగ్గు పడుతూ కనిపించాడు.
ఇక దేవకీ నందన వాసుదేవ సినిమా గురంచి సందీప్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ తనకు తెలుసని.. ప్రశాంత్ అదిరిపోయే స్క్రిప్టు ఇచ్చాడని.. ఈ కథ కోసం ఇండస్ట్రీలో చాలామంది పోటీ పడ్డారని.. అదృష్ట వశాత్తూ అశోక్‌కు ఇందులో నటించే అవకాశముందని.. సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని సందీప్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
This post was last modified on November 12, 2024 11:05 pm
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…