నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న బాలయ్య 109 టైటిల్ టీజర్ ఈ వారమే విడుదల కానుంది. ఉదయం 10 గంటల 24 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దీని పేరు గురించి సితార టీమ్ లో వారాల తరబడి చర్చలు జరుగుతూనే ఉన్నాయట. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దర్శకుడు బాబీ మూడు టైటిల్స్ ప్రతిపాదించాడు. అవి వీరమాస్, డాకూ మహారాజ్, సర్కార్ సీతారామ్. వీటిలో బాలయ్య డాకూ మహారాజ్ వైపే మొగ్గు చూపినట్టు ఆ మేరకు దానికి అనుగుణంగానే వీడియో కట్ చేయించి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారట. ఈ సస్పెన్స్ వీడాలంటే ఇంకో మూడు రోజులు ఆగాలి.
టైటిల్ మాత్రమే కాదు ఎప్పుడు ప్రకటించాలనే ముహూర్తం కూడా బాలయ్యనే నిర్ణయించినట్టు తెలిసింది. సంక్రాంతి 2025 రావడం పక్కానే కానీ డేట్ మాత్రం ఇంకా బయటికి చెప్పలేదు. లీక్స్ ప్రకారం జనవరి 12 దాదాపు లాకైనట్టే. అది కూడా టైటిల్ టీజర్ లోనే రివీల్ అయిపోతుంది. అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి. అడవుల్లో ఉంటూ దొంగతనాలు చేసే దుర్మార్గుల అంతు చూసే డాకూగా బాలయ్య రోల్ డిఫరెంట్ గా ఉంటుందని వినిపిస్తోంది. మూడు షేడ్స్ ఉంటాయని, ఒకదాని తాలూకు లుక్ మాత్రం థియేటర్లోనే సర్ప్రైజ్ గా ఇవ్వాలని దర్శకుడుబాబీ డిసైడ్ చేశారట.
పండగ సెంటిమెంట్ మరోసారి బ్లాక్ బస్టర్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, మజాకాలతో పాటు అజిత్ సినిమాలు పోటీలో ఉన్న నేపథ్యంలో బాలయ్య రికార్డుల మోత ఎలా ఉంటుందో వేచి చూడాలి. వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత బాబీ గ్యాప్ తీసుకుని మరీ ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. తమన్ బాలకృష్ణ కాంబో మరోసారి రిపీట్ కానుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత వరసగా నాలుగోసారి ఈ కలయికలో ఆల్బమ్ రాబోతోంది. టీజర్ కే హైప్ అమాంతం పెరుగుతుందని అంటున్నారు. బిజినెస్ ఆఫర్స్ క్రేజీగా ఉన్నాయి.
This post was last modified on November 12, 2024 10:55 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…