బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో వస్తున్న స్పందన చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అధిక శాతం నెగటివ్ గా ఉండటమే కాక కొందరు ఏకంగా ట్రోలింగ్ కు పాల్పడుతున్నారు. థియేటర్లలో అంత భారీ రెస్పాన్స్ తెచ్చుకుని అయిదు వందల కోట్లకు పైగా వసూలు చేసిన ఒక సూపర్ హిట్ మూవీకి డిజిటల్ లో ఇలా జరగడం అనూహ్యం. ముఖ్యంగా సెకండాఫ్ గురించి కంప్లయింట్స్ తో పాటు దర్శకుడు కొరటాల శివ వదిలేసిన కొన్ని లాజిక్స్ గురించి అదే పనిగా వీడియోలు, స్క్రీన్ షాట్లు తీసి మరీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.
ఉదాహరణకు చెల్లి పెళ్లికి దేవరని పిలవడం కోసం శ్రీకాంత్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి నాకు కూడా చెల్లి లాంటిది నేనే అత్తారింటికి పంపిస్తానని తారక్ అంటాడు. ఆ లెక్కన దేవర కొడుకు వరకు శ్రీకాంత్ కూతురు జాన్వీ కపూర్ ఏమవుతుందో చిన్నపిల్లాడు అడిగినా చెబుతాడు. అలాంటప్పుడు లవ్ స్టోరీ కుదరదు. ఏదో ఫ్లోలో రాసుకుంటూ వెళ్లిపోయారు కానీ ఇప్పుడు నెటిజెన్లు ఇలాంటివి బోలెడు తవ్వి తీస్తున్నారు. పైగా థియేటర్లో చూసినప్పుడు పాజ్, రివైండ్, ఫార్వార్డ్ ఉండవు కానీ ఓటిటిలో అలా కాదు. 4కెలో ఫ్రీజ్ చేసి డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు అదే జరుగుతోందని వేరే చెప్పనక్కర్లేదు.
అయితే ఒకటి మాత్రం నిజం. బిగ్ స్క్రీన్ మీద గ్రాండియర్ అనిపించేవి అంతే మోతాదులో చిన్న తెరమీదకూడా అనుభూతి ఇస్తాయని గ్యారెంటీ లేదు. ఆ మాటకొస్తే కల్కి 2898 ఏడి డిజిటల్ వ్యూస్ లో భారీ రికార్డులు సృష్టించలేకపోయింది. దేవర ట్రెండింగ్ లో ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ ఆశించింది ఈ తరహాలో కాదు. అయినా ఇలా పోస్ట్ మార్టం చేసుకుంటూ పోతే ఏ సినిమాలో అయినా ఇలాంటివి బోలెడు పట్టుకోవచ్చు. కాకపోతే దేవరని ఈసారి ఎక్కువగా దొరికిపోయాడు. క్లైమాక్స్ పట్ల అసంతృప్తి మెజారిటీలో కనిపిస్తోంది. ఈ ఫీడ్ బ్యాక్ దేవర ని సీరియస్ గా విశ్లేషించుకుంటే దేవర పార్ట్ 2కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.
This post was last modified on November 12, 2024 6:21 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…