అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే యూవీ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొత్త దర్శకుడు అనిల్ తో దాదాపు 100కోట్ల బడ్జెట్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ధీర అనే టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ హఠాత్తుగా ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. ఇక దానిపై ఒక క్లారిటీ రాకముందే అఖిల్ మరో దర్శకుడు తో సినిమాను లైన్లో పెట్టాడు.
వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు మురళి కిషోర్ తో అఖిల్ తదుపరి సినిమా రాబోతోంది. నాగార్జున ద్వారానే ఈ కథ సెట్టయినట్లు తెలుస్తోంది. అయితే UV క్రియేషన్ సినిమా ఎందుకు ఆగింది అనే విషయంలో మాత్రం ఎక్కడ సరైన క్లారిటీ రాలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే నాగర్జున నిర్ణయం ద్వారా ఆ సినిమాను హోల్డ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఏజెంట్ డిజాస్టర్ తర్వాత మళ్లీ అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా చేయడం మార్కెట్ పరంగా మంచిది కాదు అని సలహా ఇచ్చారట. ముందుగా అఖిల్ నటుడిగా మంచి గుర్తింపు అందుకోవడమే కాకుండా ఒక కమర్షియల్ సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నాగర్జున స్వయంగా రంగంలోకి దిగి మరి ఈ ప్రణాళికను మార్చినట్లుగా తెలుస్తోంది. ఇక మురళి కిషోర్ తో చేయబోయే ప్రాజెక్టు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ గా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
సినిమా కథ మాత్రం 80 కాలంలో జరిగే విధంగా దర్శకుడు తనదైన శైలిలో సిద్ధం చేసుకున్నట్లు టాక్. ఈ విషయంలో సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక నటుడిగా అఖిల్ కొత్తగా కనిపించేందుకు ఈ సినిమాలో కంటెంట్ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే నాగర్జున బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకూడదని అన్నపూర్ణ బ్యానర్ లోనే ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా తర్వాతే UV ప్రాజెక్టుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on November 12, 2024 5:02 pm
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…