మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ – మిస్టర్ మజ్ను – రంగ్ దే అంటూ ప్రేమ కథలు టచ్ చేసిన వెంకీ ఒకే రకమైన కథలు చేస్తాడనే మార్క్ ఉండేది. కానీ సార్ సినిమాతో ట్రాక్ మార్చి లక్కీ భాస్కర్ తో పర్ఫెక్ట్ కంటెంట్ ఉన్న డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా కథలు మొదట మన హీరోలతో ఎందుకు చేయలేదు అనే చర్చ గట్టిగానే నడిచింది.
ధనుష్ – దుల్కర్ సల్మాన్ తరహా ఇమేజ్ తో ఉండే హీరోలు టాలీవుడ్ లో కూడా ఉన్నారు. వరుణ్ తేజ్, నాని, నాగచైతన్య లాంటి హీరోలు ఆ కథలకు సూటవుతారు కదా అనే సందేహం రాకుండా ఉండదు. నిజానికి ఈ రెండు కథలు వరుణ్ తేజ్ ముందు చర్చల్లోకి వచ్చినవే. ఎందుకంటే తొలిప్రేమ కలయికతో డైరెక్టర్ హీరోకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. దీంతో ఏ కథ సిద్ధం చేసుకున్నా కూడా వెంకీ నాకు చెబుతాడు అని ఇటీవల మట్కా ప్రమోషన్ లో వరుణ్ చెప్పాడు.
ఇక లక్కీ భాస్కర్ కథ కూడా నాకు చెప్పినప్పుడు బాగా అనిపించింది, కానీ సార్ కథ చేయాలని ఉండేది. అయితే అప్పటికే వెంకీ ధనుష్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ భవిష్యత్తులో మాత్రం తప్పకుండా వెంకీతో ఒక సినిమా చేస్తానని వరుణ్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఇక నెక్స్ట్ మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు చెబుతూ, అదొక కామెడీ హారర్ సినిమా అని వివరణ ఇచ్చారు. అలాగే చెల్లి ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వరుణ్ తెలిపాడు.
This post was last modified on November 12, 2024 5:02 pm
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…
నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…
తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్కు…