హీరోతో టాలీవుడ్ కు పరిచయమైన అశోక్ గల్లా డెబ్యూతో ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో రెండో సినిమాకు బాగా గ్యాప్ తీసుకున్నాడు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ అందించిన కథ కావడం వల్ల దీని మీద ప్రత్యేక అంచనాలున్నాయి. వాస్తవానికి కంగువ, మట్కాతో పోటీ పడాలని నవంబర్ 14 విడుదల తేదీ ప్రకటించారు. తర్వాత ప్రాక్టికల్ గా అలోచించి వారం వాయిదా వేస్తే మంచిదనే ఉద్దేశంతో నవంబర్ 22కి షిఫ్ట్ చేశారు. ఇవాళ దగ్గుబాటి రానా అతిథిగా హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ జరిగింది. ఎక్కువ నాన్చకుండా కథకు సంబంధించి కీలకమైన క్లూస్ ఇచ్చారు.
తల్లి గారాబంతో పెరిగిన ఒక యువకుడు. జాతకం ప్రకారం ఫలానా సంవత్సరంలో గండం ఉందని జ్యోతిష్యుడు చెబుతాడు. ఇంకోవైపు ఇతని పుట్టుక వల్ల శత్రువు ప్రాణం పోయే ప్రమాదం ఉందని ఒక స్వామి చెప్పడంతో రెండు కుటుంబాల మధ్య కనిపించని అగాథం ఉంటుంది. పెరిగి పెద్దయ్యాక ఊళ్ళో గొడవలు మొదలవుతాయి. సుదర్శన చక్రం ఉన్న కృష్ణుడి విగ్రహం ఉన్న ఒకే ఊరిలో కురుక్షేత్ర సంగ్రామానికి పునాది పడుతుంది. కంసుడి లాంటి బంధువుని వాసుదేవుడు ఎలా కాచుకున్నాడనే పాయింట్ మీద మంచి కమర్షియల్ విలేజ్ ఎంటర్ టైనర్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.
ఇదంతా చూస్తే మురారి గుర్తుకు రావడం సహజం. అందులో మహేష్ బాబుకు వంశపారంపర్యంగా వచ్చిన శాపం వల్ల ప్రాణ గండం ఉంటుంది. దాన్నుంచి తప్పించేందుకు బామ్మ చాలా తపన పడుతుంది. వాసుదేవలో ఆ బాధ్యతని తల్లికి ఇచ్చారు. గుణ 369తో దర్శకుడిగా మారిన అర్జున్ జంధ్యాల ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ బడ్జెట్ పెట్టారు. విఎఫెక్స్ క్వాలిటీ బాగుంది. ప్రశాంత్ వర్మ రచన కాబట్టి ఆయన పర్యవేక్షణ ఉండే ఉంటుంది. డేట్ మారినా కాంపిటీషన్ అయితే గట్టిగానే ఉంది. విశ్వక్ సేన్, సత్యదేవ్ లను కాచుకోవాల్సి ఉంటుంది. ఫాంటసీ ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ మెప్పిస్తే కనక వాసుదేవకు విజయమే.
This post was last modified on November 12, 2024 2:33 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…