ఎల్లుండి విడుదల కాబోతున్న కంగువ మీద సూర్య ప్రాణాలు పెట్టుకున్నాడు. కెరీర్ లోనే అత్యధిక కాలం షూటింగ్ చేసిన తొలి ప్యాన్ ఇండియా మూవీగా గొప్ప మైలురాయి అవుతుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు. దానికి తగ్గట్టే పగలు రేయి తేడా లేకుండా ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేశాడు. నిర్మాత జ్ఞానవేల్ రాజా సైతం ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా ఐమాక్స్, త్రిడితో సహా అన్ని వర్షన్లు సకాలంలో సిద్ధం చేశారు. అయితే అభిమానులు కోరుకుంటున్న గ్రాండ్ ఓపెనింగ్ దక్కాలంటే భారీ ఎత్తున స్క్రీన్లు దక్కాలి. గోట్, లియో, జైలర్ రేంజ్ లో పంపిణీదారుల మద్దతు కావాలి.
కానీ కంగువకు అమరన్ రూపంలో పడుతున్న స్పీడ్ బ్రేకర్ గురించి ఆల్రెడీ విన్నాం కదా. ఈ సమస్యని పరిష్కరించడానికి ఇరు వైపులా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ప్రయోజనం దక్కలేదట. తమిళనాడులో ఒప్పందాల ప్రకారం ఏ సినిమాకైనా మూడో వారం నుంచి డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ షేర్ వెళ్తుంది. అమరన్ బలంగా రన్ అవుతున్న నేపథ్యంలో దానికి తగినన్ని స్క్రీన్లు కేటాయిస్తే లాభాలు పెరుగుతాయనేది వాళ్ళ వెర్షన్. కానీ కంగువకు కౌంట్ తగ్గితే ఆ ప్రభావం నేరుగా నెంబర్స్ మీద పడుతుంది. ఫ్యాన్స్ మాత్రం ఇది అన్యాయమని, సపోర్ట్ చేయడానికి బదులు ఇలా జరగడం సరికాదని అంటున్నారు.
ఇప్పటికిప్పుడు ఇదంతా మారిపోదు కానీ చూస్తుంటే తమిళనాడు కంటే ఏపీ తెలంగాణలోనే కంగువకు ఎక్కువ ఓపెనింగ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 నుంచే షోలు మొదలుపెడుతున్నారు. చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఫుల్ అవుతున్నాయి. సిరుతై శివ దర్శకత్వంలో రూపొందిన కంగువ దిశా పటాని హీరోయిన్ కాగా బాబీ డియోల్ విలనీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో పాటు వందల కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన గ్రాండియర్ కొత్త అనుభూతి ఇస్తుందని నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. సూర్య ఎలాంటి అంకెలు నమోదు చేస్తాడో చూడాలి.
This post was last modified on November 12, 2024 12:15 pm
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…