గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చాక ఒక్కసారిగా అంచనాల్లో మార్పు వచ్చేసింది. రెండో రోజులు కాకుండానే 70 మిలియన్లు దాటేసి మంచి ట్రెండింగ్ లో ఉన్న ఈ స్పందన చూసి మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మొత్తం మూడు షేడ్స్ లో కనిపించే సంగతి తెలిసిందే. ఆ లుక్స్ ని రివీల్ చేశారు కూడా. కాలేజీ విద్యార్ధి, ఐఏఎస్ ఆఫీసర్ తో పాటు కీలకమైన రైతు కం రాజకీయ నాయకుడి గెటప్ ని దాచకుండా చూపించేశారు. అయితే కమర్షియల్ కోణంలో అభిమానులు ఎక్కువగా రామ్, రామ్ నందన్ పాత్రల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు కానీ అసలు వ్యవహారం అప్పన్నదేనట.
కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అప్పన్నగా పంచె కట్టుకుని రామ్ చరణ్ కు డిజైన్ చేసిన ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. తన సరసన భార్యగా నటించిన అంజలిని గిరిజన నృత్య కళాకారిణిగా చూపించడమే కాక ఒక సామజిక సమస్య కోసం అప్పన్న చేసే పోరాటం ఓ రేంజ్ లో వచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా పోలీసులు అరెస్ట్ చేసే తీసుకెళ్తున్నప్పుడు చేతికి సంకెళ్ళున్నా తన మీద దాడికి వచ్చే వాళ్ళను ఎదురుకునే తీరు హైలైట్స్ లో ప్రధానమైందిగా చెబుతున్నారు. ఇక్కడే అప్పన్న క్యారెక్టర్ కు సంబంధిన కీలక ట్విస్టుతో కూడిన ముగింపు ఉంటుందని మరో అప్డేట్.
దర్శకుడు శంకర్ లోని వింటేజ్ ఇందులోనే బయటపడుతుందట. ఎలక్షన్ ఆఫీసర్ గా రామ్ చరణ్ చేయబోయే విన్యాసాలన్నీ అప్పన్న ఇచ్చే ప్రభావం వల్లే ఎలివేట్ అవుతాయని, ఇవన్నీ తెరమీద చూసినప్పుడు ఊహించని మలుపులతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయని చెబుతున్నారు. తినబోతూ రుచులు ఎందుకు కానీ ఇక్కడ చెప్పింది చాలా తక్కువనే సమాచారం మాత్రం పక్కానే. డల్లాస్ లో చేయబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు పలు వేడుకలను గేమ్ ఛేంజర్ ప్రమోషన్ కోసం సిద్ధం చేస్తున్నారు. పుష్ప 2 హడావిడి తగ్గాక పూర్తి స్థాయిలో పబ్లిసిటీని పెంచేందుకు దిల్ రాజు టీమ్ ప్రణాళికలు వేస్తోంది.
This post was last modified on November 11, 2024 4:02 pm
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…